Telugu Global
NEWS

ఫస్ట్ టైమ్‌ హర్రర్ మూవీలో ప్రభాస్

తాజాగా ప్రభాస్ -మారుతి సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా హర్రర్ కథాంశంతో తెరకెక్కుతుందా..? లేదా..? అనే విషయమై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

ఫస్ట్ టైమ్‌ హర్రర్ మూవీలో ప్రభాస్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫస్ట్ టైమ్‌ ఓ హర్రర్ మూవీలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే తాజాగా ధ్రువీకరించారు. ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన సలార్ పార్ట్-1 ఇటీవల విడుద‌లై సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత సలార్ -2తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898ఏడీ, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీలో ప్రభాస్ నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఓ మూవీ లాంచ్ చేశారు. ఈ సినిమా పలు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ నెలల తరబడి ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. హర్రర్ సబ్జెక్టుతో ఈ మూవీ తెరకెక్కుతోందని.. దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టినట్లు కూడా ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ప్రభాస్ -మారుతి సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా హర్రర్ కథాంశంతో తెరకెక్కుతుందా..? లేదా..? అనే విషయమై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. తాజాగా ఈ మూవీ గురించి ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. మారుతితో తాను చేస్తున్న సినిమా హర్రర్ నేపథ్యంలో సాగుతుందని ప్రకటించారు. ప్రభాస్ హర్రర్ మూవీలో నటించడం ఇదే ఫస్ట్ టైమ్‌. మారుతి ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రేమకథా చిత్రమ్ అనే మూవీ తీశాడు.

కామెడీ టచ్ తో సాగిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మారుతి ప్రభాస్ తో చేస్తున్న సినిమా కూడా హర్రర్, కామెడీ టచ్ తోనే ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

First Published:  3 Jan 2024 3:08 PM GMT
Next Story