Telugu Global
NEWS

ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌ - బాలయ్య షోకు ప్రభాస్

ఇప్పటికే ప్రభాస్‌ను కలిసి అన్ స్టాపబుల్ షోకు హాజరు కావడానికి ఓకే చెప్పించినట్లు టాక్. అంతేకాదు ప్రభాస్‌తో పాటు మరో హీరో గోపీచంద్‌ని కూడా ప్రభాస్ వెంట తీసుకొస్తున్నారు.

ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌  - బాలయ్య షోకు ప్రభాస్
X

ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ అనే షోకు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో సంచలనం సృష్టించిన ఈ షో సెకండ్ సీజన్‌లో అంత ప్రభావం చూపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్లో చంద్రబాబు, నారా లోకేష్ చీఫ్ గెస్టులుగా హాజరుకాగా అది రాజకీయంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాతి ఎపిసోడ్లకు అంతగా ఆదరణ దక్కలేదు. దీంతో ఆహా నిర్వాహకుడు అల్లు అరవింద్ రంగంలోకి దిగాడు. ఈ షోకు మరింత అట్రాక్షన్ తీసుకువచ్చేందుకు ఏకంగా ప్రభాస్‌ను రప్పిస్తున్నాడు.

ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉన్న ప్రభాస్ మీడియాలో ఎక్కడా కనిపించడు. ఇంటర్వ్యూలు కూడా పెద్దగా ఇవ్వడు. తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లలో కూడా పెద్దగా కనిపించడు. అయితే ప్రభాస్ బయటికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని, ఇంటర్వ్యూలు ఇస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశ పడుతుంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలను అల్లు అరవింద్ నిజం చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్‌ను కలిసి అన్ స్టాపబుల్ షోకు హాజరు కావడానికి ఓకే చెప్పించినట్లు టాక్. అంతేకాదు ప్రభాస్‌తో పాటు మరో హీరో గోపీచంద్‌ని కూడా ప్రభాస్ వెంట తీసుకొస్తున్నారు.

ప్రభాస్, గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకోసమే వీరిద్దరినీ ఈ షోకు తీసుకొస్తున్నారు. ఈనెల 11వ తేదీన ఈ ఎపిసోడ్‌ను షూట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి వర్క్ కూడా జరుగుతోంది. ప్రభాస్‌ను బాలకృష్ణ ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు.. ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎపిసోడ్‌ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా నిర్వాకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

First Published:  2 Dec 2022 1:52 PM GMT
Next Story