Telugu Global
NEWS

భవదీయుడు భగత్ సింగ్‌కి మోక్షం కలుగునా?

హరి హర వీర మల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ మరో పక్క కొత్త సినిమాలని పట్టాలెక్కించే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే హరీష్ శంకర్ ఆల్రెడీ రెడీగా ఉన్నప్పటికీ ఈ దర్శకుడికి కాకుండా సుజీత్ అని ఇంకో దర్శకుడితో సినిమా చేయడానికి పవన్ ఒప్పుకోవడం, భవదీయుడు భగత్ సింగ్ మీద కొత్త అనుమానాలకు తెర లేపుతుంది.

భవదీయుడు భగత్ సింగ్‌కి మోక్షం కలుగునా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే దర్శకుడైన, ఏ నిర్మాతైనా ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఎక్కువ రీమేక్ సినిమాలే చేస్తూ ఉండటంతో అతను స్ట్రైట్ సినిమా ఎప్పుడు తీస్తాడా అని అందరూ ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్‌తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా ప్రకటన రావడంతో అభిమానులందరూ సంతోషించారు. అయితే ఈ ప్రకటన తెచ్చిన ఆనందం ఇప్పుడు వాళ్ళకి లేనట్టుగానే ఉంది.

హరీష్ శంకర్ సినిమాకి సంబంధించిన‌ స్క్రిప్ట్ పనులు ముగించినప్పటికీ ఈ సినిమా మొదలవుతుందా లేదా అనే విషయంలో మీమాంస ఏర్పడింది. ముందు నుంచి ఈ సినిమా ఆగిపోతుంది అని చాలా మంది చెప్తూ ఉండటంతో అసలు నిజంగానే ఈ సినిమా ఉంటుందా లేదా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ హరీష్ శంకర్ మాత్రం సినిమా కచ్చితంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

ఒక పక్క హరి హర వీర మల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ మరో పక్క కొత్త సినిమాలని పట్టాలెక్కించే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే హరీష్ శంకర్ ఆల్రెడీ రెడీగా ఉన్నప్పటికీ ఈ దర్శకుడికి కాకుండా సుజీత్ అని ఇంకో దర్శకుడితో సినిమా చేయడానికి పవన్ ఒప్పుకోవడం, భవదీయుడు భగత్ సింగ్ మీద కొత్త అనుమానాలకు తెర లేపుతుంది.

ప్రస్తుతానికైతే హరీష్ శంకర్ కూడా తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకరిద్దరు యువ హీరోలు హరీష్‌తో పని చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనీ హరీష్ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

First Published:  6 Dec 2022 12:57 PM GMT
Next Story