Telugu Global
Cinema & Entertainment

Trivikram Srinivas: త్రివిక్ర‌మ్‌ను తిట్టిపోస్తున్న ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానులు

సుజీత్ లాంటి యువ దర్శకుడితో పవన్ కళ్యాణ్ పని చేస్తే బాగుంటుంది అని అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా కొంత మంది ప‌వ‌న్ అభిమానులు మాత్రం త్రివిక్రమ్‌ని ట్రోల్‌ చేస్తున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్
X

త్రివిక్రమ్ శ్రీనివాస్

సాహో సినిమా పరాజయం పాలయ్యాక డైరెక్టర్ సుజీత్ నెక్స్ట్ ఏం సినిమా చేస్తాడా అని అందరూ ఎంతగానో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో సినిమా ప్రకటన రాగానే పవన్ ఫాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. సుజీత్ లాంటి యువ దర్శకుడితో పవన్ కళ్యాణ్ పని చేస్తే బాగుంటుంది అని అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా కొంత మంది ప‌వ‌న్ అభిమానులు మాత్రం త్రివిక్రమ్‌ని ట్రోల్‌ చేస్తున్నారు.

నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌తో కలిసి జల్సా, అత్తారింటికి దారేది వంటి పెద్ద హిట్స్‌ని అందించాడు. కాకపోతే ఆజ్ఞతవాసి సినిమాతో అభిమానుల కోపాన్ని కూడా త్రివిక్రమ్ చ‌విచూశాడు అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్‌ని ఎలా అయితే చూడకూడదు అని అనుకుంటారో అభిమానులని అలా చూపించాడు త్రివిక్రమ్.

అయితే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల్లో త్రివిక్రమ్ పాత్ర ఉంది అని అందరూ అంటూ ఉంటారు. భీమ్లా నాయక్ విషయంలో త్రివిక్రమ్ మార్పులు చేయడం జరిగింది. అభిమానులు సుజీత్‌తో పవన్ చేయబోయే సినిమాకి మాత్రం త్రివిక్రమ్ వేలు పెట్టకూడదు అని భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌కి త్రివిక్రమ్‌కి ఉన్న సాన్నిహిత్యం వల్ల త్రివిక్రమ్ సాధారణంగానే ఈ సినిమా కథా చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే త్రివిక్రమ్ సలహాలు మాత్రం సుజీత్ తీసుకోకూడదు అని, త్రివిక్రమ్‌ని సెట్స్ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు అని, ఎంత కుదిరితే అంత త్రివిక్రమ్‌ని దూరం పెట్టాలని పవన్ అభిమానులే సుజీత్‌కి సోషల్ మీడియా ద్వారా సూచిస్తున్నారు.

ఈ వ్యవహారం మొత్తంలో తన పాత్ర ఏమి లేకపోయినా త్రివిక్రమ్ ట్రోల్స్‌ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది.

First Published:  6 Dec 2022 6:52 AM GMT
Next Story