Telugu Global
NEWS

వ‌రుణ్ పెళ్లికి నితిన్ బ‌స్సు.. తెలుగోళ్లు ఎక్క‌డున్నా వెరైటీయే!

నితిన్ న‌టిస్తున్న ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ షూటింగ్ ఇటలీలోనే జ‌రుగుతోంది. నితిన్‌తోపాటు ఆయ‌న భార్య‌, అక్క‌, బావ అంతా అక్క‌డే ఉన్నారు.

వ‌రుణ్ పెళ్లికి నితిన్ బ‌స్సు.. తెలుగోళ్లు ఎక్క‌డున్నా వెరైటీయే!
X

నాగ‌బాబు త‌న‌యుడు, హీరో వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య‌ల పెళ్లికి స‌ర్వం సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే వ‌ధూవ‌రులు, ఇరు కుటుంబాలవారు పెళ్లి వేదిక‌యిన ఇటలీకి త‌ర‌లివెళ్లారు. రాజ‌కీయాలు, సినిమాల్లో బిజీగా ఉన్న బాబాయి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా స‌తీస‌మేతంగా వెళ్లాడు. ఇవ‌న్నీ ఒక‌త్త‌యితే వ‌రుణ్ తేజ్ పెళ్లికి మ‌రో హీరో నితిన్ ఏకంగా బ‌స్సు వేసుకుని బ‌య‌ల్దేర‌డం ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఇండియా నుంచి కాదు.. ఇటలీ నుంచే

వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠీల‌ పెళ్లి అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌నుంది. ఇటలీ నుంచి తిరిగొచ్చాక హైద‌రాబాద్‌లో భారీ రిసెప్ష‌న్ ప్లాన్ చేశారు. వివాహ వేదిక ఇటలీ కాబ‌ట్టి మెగా ఫ్యామిలీయే త‌ప్ప తోటి న‌టులు కూడా ఎవ‌రూ వెళ్ల‌లేదు. అయితే ఆ లోటు తీర్చేస్తున్నాడు యువ హీరో నితిన్‌. నితిన్ న‌టిస్తున్న ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ షూటింగ్ ఇటలీలోనే జ‌రుగుతోంది. నితిన్‌తోపాటు ఆయ‌న భార్య‌, అక్క‌, బావ అంతా అక్క‌డే ఉన్నారు. వీళ్ల‌తోపాటు కొంత‌మంది మూవీ క్రూను కూడా తీసుకుని వ‌రుణ్ వారి పెళ్లి అని స్టిక్క‌ర్లు అంటించి మరీ బ‌స్సు సిద్ధం చేసుకుని బ‌య‌ల్దేరుతున్నాడు. ఈ బ‌స్సు ముందు నితిన్ ఫోజిచ్చిన ఫొటో ఇప్పుడు నెట్‌లో హంగామా చేస్తోంది.

తెలుగోళ్ల సంద‌డి మ‌రి

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి అంటే ఒక‌ప్పుడు బ‌స్సులు వేసేవారు. ఇప్పుడు అంద‌రూ కార్లు కొన‌డం వ‌చ్చాక కార్లు వేసుకుని వెళుతున్నా కూడా దూర‌ప్రాంతాల్లో పెళ్లి అంటే పెళ్లి బ‌స్సు త‌ప్ప‌నిస‌రి. ఆ ట్రెండ్‌ను ఇటలీలోనూ కొన‌సాగిస్తున్నాడు నితిన్ అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమాని అయిన నితిన్.. చిరంజీవి ఫ్యామిలీ అంద‌రితో మంచి సంబంధాలు మెయింటెన్ చేస్తాడు. వ‌రుణ్, చ‌ర‌ణ్ త‌దిత‌రుల ప్రైవేట్ పార్టీల్లోనూ నితిన్ క‌చ్చితంగా క‌నిపిస్తాడు. ఇప్పుడు త‌న దోస్తు పెళ్లికి ఇటలీలోనూ హంగామా చేస్తున్నాడు.

First Published:  31 Oct 2023 7:30 AM GMT
Next Story