Telugu Global
NEWS

New 20% TCS | విదేశీ టూర్ల‌కెళ్లినా.. విద్యాభ్యాసం చేసినా.. అక్టోబ‌ర్ 1 నుంచి టీసీఎస్ మోతే..!

అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి విదేశీ యానం మొద‌లు వివిధ ర‌కాల లావాదేవీలపై టాక్స్ క‌లెక్ష‌న్ ఎట్ సోర్స్ (టీసీఎస్‌) నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌స్తాయి.

New 20% TCS | విదేశీ టూర్ల‌కెళ్లినా.. విద్యాభ్యాసం చేసినా.. అక్టోబ‌ర్ 1 నుంచి టీసీఎస్ మోతే..!
X

New 20% TCS | విదేశాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లినా.. పిల్ల‌ల‌ను చూడ‌టానికి వెళ్లినా.. విదేశీ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టినా.. విదేశీ సంస్థ‌ల్లో స్టాక్స్‌లో/ క్రిప్టో క‌రెన్సీల్లో పెట్టుబ‌డులు పెట్టినా.. పిల్ల‌ల విదేశీ విద్య కోసం ఖ‌ర్చు చేసినా.. ఆదాయ ప‌న్ను చ‌ట్టంలో స‌మూల మార్పులు వ‌చ్చాయి. అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి విదేశీ యానం మొద‌లు వివిధ ర‌కాల లావాదేవీలపై టాక్స్ క‌లెక్ష‌న్ ఎట్ సోర్స్ (టీసీఎస్‌) నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌స్తాయి. వచ్చేనెల నుంచి ప్రారంభ‌మ‌య్యే వివిధ ర‌కాల లావాదేవీల‌పై 20 శాతం టీసీఎస్ వ‌సూలు చేస్తారు.. అవేమిటంటే..!

ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో వైద్య ప‌రిర‌క్ష‌ణ చెల్లింపులు రూ.7 ల‌క్ష‌లు దాటితే ఐదు శాతం టీసీఎస్ వ‌ర్తిస్తుంది.

♦ విదేశాల్లో ఉన్న‌త విద్యా కోర్సు అభ్య‌సించేందుకు వెళ్లిన విద్యార్థిపై ఏటా రూ.7 ల‌క్ష‌ల్లోపు ఖ‌ర్చుపై టీసీఎస్ వ‌సూళ్లు ఉండ‌వు. ఒక ఆర్థిక సంస్థ నుంచి రూ.7 ల‌క్ష‌ల‌కు పైగా రుణం తీసుకున్నా 0.5 శాతం టీసీఎస్‌, రుణం లేకుండా మొత్తం చెల్లిస్లే 5 శాతం టీసీఎస్ పే చేయాల్సి ఉంటుంది.

♦ ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.7 ల‌క్ష‌ల‌కు పైగా విదేశీ పెట్టుబ‌డులతోపాటు ఇత‌ర అవ‌స‌రాల‌కు అంత‌ర్జాతీయ లావాదేవీలు జ‌రిపినా 20 శాతం టీసీఎస్ వ‌ర్తిస్తుంది. విదేశీ సంస్థ‌ల్లో ఈక్విటీలు, విదేశీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌, క్రిప్టో క‌రెన్సీలు, రియ‌ల్ ఎస్టేట్ రంగాల్లో రూ.7 ల‌క్ష‌ల‌కు పైగా పెట్టుబ‌డులు పెడితే 20 శాతం టీసీఎస్ పే చేయాల్సిందే.

♦ విదేశాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌కు రూ.7 ల‌క్ష‌ల్లోపు ఖ‌ర్చు చేస్తే ఐదు శాతం, రూ.7 ల‌క్ష‌లు దాటితే 20 శాతం టీసీఎస్ పే చేయాల్సి ఉంటుంది.

♦ ఇప్ప‌టివ‌ర‌కు క్రెడిట్ కార్డుల‌తో విదేశాల్లో లావాదేవీల‌పై ఎటువంటి టీసీఎస్ డిడ‌క్ట్ చేయ‌లేదు. కానీ అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి విదేశాల్లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో రూ.7 ల‌క్ష‌ల పై చిలుకు ఖ‌ర్చు చేస్తే 20 శాతం టీసీఎస్ వ‌ర్తిస్తుంది.

♦ ఆర్బీఐ లిబ‌ర‌లైజ్డ్ రెమిటెన్స్ స్కీం (ఎల్ఆర్ఎస్‌) కింద ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎవ‌రైనా 2.50 ల‌క్ష‌ల డాల‌ర్లు చెల్లింపులు జ‌రిపినా టీసీఎస్ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. నాన్ మెడిక‌ల్‌, విద్యా అవ‌స‌రాల‌కు రూ.7ల‌క్ష‌ల రెమిటెన్స్ చేసినా 20 శాతం టీసీఎస్ చెల్లించాల్సిందే.

♦ ఇత‌ర అవ‌స‌రాల కోసం రూ.7 ల‌క్ష‌ల్లోపు విదేశాల‌కు న‌గ‌దు బ‌దిలీ చేస్తే ఐదు శాతం, రూ.7 ల‌క్ష‌ల‌కు పైగా బ‌దిలీ చేస్తే 20 శాతం టీసీఎస్ క‌ట్ చేస్తారు.

♦ ప్ర‌తి ప‌న్ను చెల్లింపు దారుడి నుంచి ఆదాయం ప‌న్ను విభాగం డిడ‌క్ట్ చేసిన `టీసీఎస్‌` సంగ‌తి ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేసినా, అడ్వాక్స్ టాక్స్ చెల్లించినా పేర్కొనాలి. త‌ద‌నుగుణంగా ఐటీ రీఫండ్ అవుతుంది.

First Published:  24 Sep 2023 7:01 AM GMT
Next Story