Telugu Global
National

వెజ్ ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే నాన్‌ వెజ్‌ డెలివరీ.. జొమాటో, మెక్‌డొనాల్డ్స్‌కు లక్ష జరిమానా

వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద ఉల్లంఘన జరిగినట్లు కోర్టు అభిప్రాయపడింది. మెక్‌డొనాల్డ్స్‌, జొమాటోకు లక్ష జరిమానా విధించింది. దీనితోపాటు రెండు సంస్థలు కూడా ఆ వ్యక్తికి కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది.

వెజ్ ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే నాన్‌ వెజ్‌ డెలివరీ.. జొమాటో, మెక్‌డొనాల్డ్స్‌కు లక్ష జరిమానా
X

వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఓ వ్యక్తికి నాన్‌ వెజ్ ఫుడ్ డెలివరీ అందింది. అయితే ఈ విషయాన్నిఆ వ్యక్తి అంత సులువుగా వదిలేయలేదు. వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోతో పాటు మెక్‌డొనాల్డ్స్‌కి ఏకంగా లక్ష రూపాయలు ఫైన్‌ వేసింది. అలాగే ఆ వ్యక్తికి కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

ఒక వ్యక్తి తన కుటుంబం కోసం జొమాటో యాప్‌లో మెక్‌డొనాల్డ్స్‌ నుంచి వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. అయితే జొమాటో ఏజెంట్‌ డెలివరీ చేసిన ఫుడ్‌ చూసి అతడు షాకయ్యాడు. వెజ్‌కు బదులు నాన్‌ వెజ్‌ ఫుడ్‌ డెలివరీ చేయడంపై ఆ వ్యక్తి ఆగ్రహం చెందాడు. ఈ నేపథ్యంలోనే మెక్‌డొనాల్డ్‌, జొమాటోపై జోధ్‌పూర్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.


దీంతో వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద ఉల్లంఘన జరిగినట్లు కోర్టు అభిప్రాయపడింది. మెక్‌డొనాల్డ్స్‌, జొమాటోకు లక్ష జరిమానా విధించింది. దీనితోపాటు రెండు సంస్థలు కూడా ఆ వ్యక్తికి కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుని జొమాటో సవాల్ చేసింది. తమ కంపెనీకి మెరిట్ రికార్డ్ ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి అప్పీల్ చేసుకుంటున్నట్టు వెల్లడించింది. వెజ్‌కి బదులుగా నాన్‌ వెజ్‌ డెలివరీ చేశారన్నది కేవలం ఆరోపణలు మాత్రమే అని వాదిస్తోంది. అయితే.. జొమాటో టర్మ్స్ అండ్ సర్వీస్‌లో లో ఓ కీలక విషయాన్ని ప్రస్తావించింది. జొమాటో అనేది కేవలం ఫుడ్‌ని అందిస్తుందని, అందులో ఏముంది అనేది కేవలం రెస్టారెంట్‌ పార్ట్‌నర్‌ పరిధిలో ఉండే విషయమని, అలాంటి తప్పులతో జొమాటోకి సంబంధం లేదని చెబుతోంది. దీనిపై పూర్తి బాధ్య‌త‌ రెస్టారెంట్‌దే అని, జోధ్‌పూర్‌ జిల్లా వినియోగదారుల తీర్పుపై అపీల్‌ చేస్తామని జొమాటో వెల్లడించింది.

First Published:  13 Oct 2023 3:15 PM GMT
Next Story