Telugu Global
National

ఎన్నికల్లో పోటీ చేయను - ప్రశాంత్ కిశోర్

బీహార్ లో జన్ సురాజ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ తాను ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన జన్ సురాజ్ ను రాజకీయపార్టీగా మార్చాలా? వద్దా? అన్న విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు.

ఎన్నికల్లో పోటీ చేయను - ప్రశాంత్ కిశోర్
X

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలోని చంపారణ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జన్ సురాజ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నారు. జన్ సురాజ్ ను రాజకీయపార్టీగా మార్చాలా? వద్దా? అన్న విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉందా? అన్న విలేకరులు ప్రశ్నకు ఆయన పై విధంగా బదులిచ్చారు.

ప్రశాంత్ కిశోర్ 'స్వల్ప రాజకీయ చతురత ఉన్న వ్యాపారి' అంటూ ఆయన మీద జేడీయూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.. నిజంగానే తాను వ్యాపారినైతే జేడీయూ తన సలహాలు ఎందుకు తీసుకున్నదని ఎదురు ప్రశ్నించారు. బిహార్ ప్రజలను నితీశ్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆయన మంచి రాజకీయాలు చేశారు కాబట్టే.. తాను మద్దతు ఇచ్చానని పేర్కొన్నారు. ఇప్పుడాయన మారిపోయారని విమర్శించారు.

నిజంగా బిహార్ లో నితీశ్ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

స్వతహాగా ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ .. నేరుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన గతంలో కొద్ది రోజుల పాటు జేడీయూలో ఉన్నారు. అయితే విభేదాలతో ఆ పార్టీలోనుంచి బయటకు వచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ ఆయన ఆ పార్టీలో చేరలేదు. ప్రస్తుతం జన్ సురాజ్ పేరిట రాజకీయ యాత్ర చేస్తున్నారు.

ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ వ్యూహకర్తగా సక్సెస్ అయ్యారు. ఆయన రాజకీయ సలహాలు ఇచ్చిన జగన్, స్టాలిన్, మమత తదితరులు ఎన్నికల్లో గెలుపొందారు. గతంలో బీజేపీకి కూడా ఆయన సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు.

First Published:  13 Nov 2022 8:32 AM GMT
Next Story