Telugu Global
National

యువతికి యువకుడి వేధింపులు.. చెప్పుతో కొట్టాలని పంచాయతీ తీర్పు

హాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జ‌రిగిన ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యువతికి యువకుడి వేధింపులు.. చెప్పుతో కొట్టాలని పంచాయతీ తీర్పు
X

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని ఓ యువకుడు నిత్యం వెంటపడుతూ వేధిస్తున్నాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతడు పట్టించుకోకుండా ఆ యువతిని ఇబ్బందులకు గురిచేశాడు. యువకుడి వేధింపులతో విసిగిపోయిన యువతి ఈ విషయమై పంచాయతీ సభ్యులకు ఫిర్యాదు చేసింది. అయితే సదరు యువకుడిని చెప్పుతో కొట్టాలని పంచాయతీ తీర్పు ఇచ్చింది. ప్రజలందరూ చూస్తుండగానే యువతి తనను వేధిస్తున్న యువకుడిని చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

హాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జ‌రిగిన ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన పట్ల నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతిని వేధించినందుకు తగిన బుద్ధి చెప్పారని కొందరు కామెంట్లు చేస్తుండగా.. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎందుకని పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే సరిపోయేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో పంచాయతీ ఇచ్చిన తీర్పుపై కేసు న‌మోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

First Published:  17 Aug 2023 2:42 PM GMT
Next Story