Telugu Global
National

నెలరోజుల్లో ఇండియాలో ట్విట్టర్ బ్లూ.. రేటెంతంటే..?

ట్విట్టర్ బ్లూకి కొత్త ఫీచర్లు జోడిస్తున్నామని, త్వరలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, సైన్ అప్ చేయాలని మెసేజ్ లు వస్తున్నాయి. సైనప్ చేస్తే నెలకు 7.99 డాలర్ల చెల్లించాల్సి ఉంటుంది.

నెలరోజుల్లో ఇండియాలో ట్విట్టర్ బ్లూ.. రేటెంతంటే..?
X

ట్విట్టర్ లో బ్లూ టిక్ కి రేటు కట్టిన కొత్త యజమాని ఎలన్ మస్క్.. దాన్ని మెల్ల మెల్లగా ట్విట్టర్ యూజర్లకు అలవాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నేరుగా బ్లూటిక్ తొలగిస్తామని చెప్పకుండా.. ట్విట్టర్ బ్లూలో అదనపు సౌకర్యాలున్నాయి సైనప్ అవ్వండి అంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు. ఈ అదనపు సౌకర్యాలకోసం నెలకు 7.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మన కరెన్సీలో అయితే దాదాపుగా 700 రూపాయలు ఖర్చు పెట్టాలన్నమాట.

ఇండియాలో ఎప్పుడు..?

ప్రస్తుతం కొత్త వెరిఫికేషన్ సిస్టమ్ తో కూడిన ట్విట్టర్ బ్లూ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలోని ఐఫోన్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ లోని ట్విట్టర్ యాప్ లో నోటిఫికేషన్లు వస్తున్నాయి. ట్విట్టర్ బ్లూకి కొత్త ఫీచర్లు జోడిస్తున్నామని, త్వరలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, సైన్ అప్ చేయాలని మెసేజ్ లు వస్తున్నాయి. సైనప్ చేస్తే నెలకు 7.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. భారత్ లో వచ్చే నెలనుంచి ట్విట్టర్ బ్లూ అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఎలన్ మస్క్. భారత్ లో ట్విట్టర్ బ్లూ ఎప్పుడంటూ వచ్చిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

రేటెంత..?

మొదట్లో బ్లూటిక్ కి 1200 రూపాయలు చెల్లించాలన్నారు. ఆ తర్వాత నెలకు 700 రూపాయలు అంటున్నారు. అయితే భారతీయ ట్విట్టర్ యూజర్లకు రేటు విషయంలో వెసులుబాటు ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడి మార్కెట్ స్థాయిని బట్టి నెలవారీ యూజర్ ఫీజు వసూలు చేస్తారు. ప్రజల కొనుగోలు శక్తికి సమానంగా ధరను సర్దుబాటు చేస్తామని మస్క్ వెల్లడించారు. అయితే దీనిని ఎలా నిర్థారిస్తారనేదానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు.

First Published:  6 Nov 2022 5:45 AM GMT
Next Story