Telugu Global
National

సంసద్ రత్న విజయసాయిరెడ్డి..

ఈ ఏడాది13 మంది ఎంపీలతో పాటు రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు, ఒకరికి లైఫ్ టైమ్ అచీవ్‌ మెంట్‌ అవార్డులను ప్రకటించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సంసద్ రత్న అవార్డు అందుకున్నారు విజయసాయిరెడ్డి.

సంసద్ రత్న విజయసాయిరెడ్డి..
X

వైసీపీ రాజ్యసభ సభ్యులు, రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల పార్లమెంట్ స్థాయీ సంఘం చైర్మన్ విజయసాయిరెడ్డి సంసద్ రత్న అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సంసద్ రత్న అవార్డు అందుకున్నారు విజయసాయిరెడ్డి. అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన తన సంతోషాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు.


సంసద్ రత్న ఎవరికి..?

లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలు, ప్రవేశ పెట్టిన ప్రైవేట్ బిల్లులు, పాల్గొన్న డిబేట్లను బట్టి సంసద్ రత్న అవార్డులు ఇస్తారు. 17వ లోక్ సభలో సభ్యుల పనితీరు ఆధారంగా సంసద్ రత్న అవార్డులను ఈ ఏడాది అందించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రాం మేఘావాల్ అధ్యక్షతన, కో ఛైర్మన్ ఎన్నికల కమిషన్ మాజీ ప్రధానాధికారి టీఎస్ కృష్ణమూర్తితో ఏర్పాటైన జ్యూరీ లోక్ సభ, రాజ్యసభ నుంచి సంసద్ రత్న అవార్డులకోసం సభ్యులను ఎంపిక చేసింది. ఢిల్లీలో ఈరోజు అవార్డు ప్రదానోత్సవం జరిగింది.

ఈ ఏడాది13 మంది ఎంపీలతో పాటు రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు, ఒకరికి లైఫ్ టైమ్ అచీవ్‌ మెంట్‌ అవార్డులను ప్రకటించారు. సీపీఐ(ఎం) సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు టీకే రంగరాజన్‌ కు ఈ ఏడాది ఏపీజే అబ్దుల్‌ కలాం లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. బిద్యుత్ బరన్ మహతో (బీజేపీ, జార్ఖండ్), సుకాంత మజుందార్ (బీజేపీ, పశ్చిమ బెంగాల్), కుల్దీప్ రాయ్ శర్మ (కాంగ్రెస్, అండమాన్ నికోబార్ దీవులు), హీనా విజయకుమార్ గావిట్ (బీజేపీ, మహారాష్ట్ర), అధీర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్), గోపాల్ చినయ్య శెట్టి (బీజేపీ, మహారాష్ట్ర), సుధీర్ గుప్తా (బీజేపీ, మధ్యప్రదేశ్), అమోల్ రాంసింగ్ కోల్హే (ఎన్సీపీ, మహారాష్ట్ర) లోక్‌ సభ సభ్యులుగా అవార్డులకు ఎంపికయ్యారు. రాజ్యసభ నుంచి, జాన్ బ్రిట్టాస్ (సీపీఐ(ఎం), కేరళ), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ, బీహార్), ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్ (ఎన్సీపీ, మహారాష్ట్ర), విషంభర్ ప్రసాద్ నిషాద్ (సమాజ్‌ వాదీ పార్టీ, యూపీ) ఛాయా వర్మ (కాంగ్రెస్, ఛత్తీస్‌గఢ్) సంసద్ రత్న అవార్డులకు ఎంపికయ్యారు.

First Published:  25 March 2023 12:24 PM GMT
Next Story