Telugu Global
National

గుజరాత్ కోసం త్యాగం.. చివరకు మహారాష్ట్రపైనే నిందలు..

ప్లాంట్‌ ను మొదట మహారాష్ట్రలోనే ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ గుజరాత్‌ తో పోల్చుకుంటే పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేకపోవడం వల్లే అహ్మదాబాద్‌ ను ఎంచుకోవాల్సి వచ్చిందని అన్నారు వేదాంత చైర్మన్.

గుజరాత్ కోసం త్యాగం.. చివరకు మహారాష్ట్రపైనే నిందలు..
X

ఇటీవల మూడు భారీ ప్రాజెక్ట్ లు మహారాష్ట్రను కాదని గుజరాత్ కి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరలింపు వెనక కేంద్రం ఉందని, గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్రకు అన్యాయం చేసిందనే ఆరోపణలున్నాయి. వరుసగా ప్రాజెక్టులన్నీ తరలిపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎదురుతిరగాల్సి ఉన్నా.. అక్కడ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయిన షిండే సీఎం కావడం కేంద్రానికి కలిసొచ్చింది. సీఎం షిండే సైలెంట్ గా ఉన్నారు. ప్రతిపక్ష ఉద్ధవ్ సేన, కాంగ్రెస్, ఎన్సీపీ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ బీజేపీ తాను చేయాల్సింది చేసింది, మహారాష్ట్రను మోసం చేసింది.

తీరా ఇప్పుడు నిందలు..

పోనీ మోసం చేసి మహారాష్ట్రనుంచి సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ ఎత్తుకెళ్లారు సరే, చివరకు నిందలు కూడా ఆ రాష్ట్రంపైనే వేయడం ఇక్కడ విచిత్రం. సెమీ కండక్టర్ల ప్లాంట్ కోసం మహారాష్ట్రను కాదని, గుజరాత్ ని ఎందుకు ఎంపిక చేసుకున్నారనే ప్రశ్నకు మహారాష్ట్రలో పరిస్థితులు అనుకూలంగా లేవని వేదాంత చైర్మన్ సమాధానం చెప్పడం విశేషం. మరి గతంలో ప్రాజెక్ట్ ఖరారు చేసుకున్నప్పుడు మహారాష్ట్ర ఎందుకు అనుకూలించిందో ఆయన చెప్పలేకపోయారు.

ప్లాంట్‌ ను మొదట మహారాష్ట్రలోనే ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ గుజరాత్‌ తో పోల్చుకుంటే పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేకపోవడం వల్లే అహ్మదాబాద్‌ ను ఎంచుకోవాల్సి వచ్చిందని అన్నారు వేదాంత చైర్మన్. తైవాన్‌ కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్ కాన్ తో కలసి భారత్‌లో తొలి సెమీకండక్టర్‌ తయారీ ప్లాంట్ గుజరాత్‌ లో ఏర్పాటైంది. రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో దీనిని నిర్మిస్తున్నారు.

First Published:  13 Nov 2022 3:12 AM GMT
Next Story