Telugu Global
National

స్లీపర్, మెట్రో.. వందే భారత్ లో మరిన్ని మార్పులు

వందేభారత్ నాన్ ఏసీ ట్రైన్లు కూడా రాబోతున్నాయి. వీటిని వందే మెట్రో అంటారు. తక్కువ దూరాల మధ్య వీటిని పుష్ పుల్ ట్రైన్ల మాదిరిగా ప్రవేశపెడతారు.

స్లీపర్, మెట్రో.. వందే భారత్ లో మరిన్ని మార్పులు
X

2019లో మొదలైన వందే భారత్ ప్రయాణంలో ఎన్నో కుదుపులు, ఒడిదొడుకులు ఉన్నాయి. ప్రస్తుతం 25రైళ్లు వివిధ రూట్లలో పరుగులు తీస్తున్నాయి. త్వరలో వీటికి మరో 9 జతకాబోతున్నాయి. రైళ్ల సంఖ్యను పెంచడంతోపాటు, వాటిలో అనేక మార్పులు, చేర్పులు కూడా తీసుకొస్తున్నారు. ఈ రైళ్లలో ఇప్పటి వరకు కేవలం కూర్చుని ప్రయాణించేందుకే వీలుంది. ఇకపై వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

త్వరలో స్లీపర్ రైళ్లు..

వందే భారత్ స్లీపర్ కోచ్ ల తయారీ మొదలైందని తెలిపారు బీజీ మాల్యా. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిగా స్లీపర్ కోచ్ లతో వందేభారత్ ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పారు. దూరప్రయాణం చేసేవారికి మరింత సౌకర్యవంతంగా ఉండేందుకే స్లీపర్ కోచ్ లను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారాయన.

నాన్ ఏసీ పుష్ పుల్

వందే భారత్ ప్రయాణం వేగవంతంగా ఉంటుంది కానీ కాస్త ఖర్చు ఎక్కువ. దీనిపై చాలా విమర్శలున్నాయి. ఈ విమర్శలను కాచుకోడానికి వందేభారత్ నాన్ ఏసీ ట్రైన్లు కూడా రాబోతున్నాయి. వీటిని వందే మెట్రో అంటారు. తక్కువ దూరాల మధ్య వీటిని పుష్ పుల్ ట్రైన్ల మాదిరిగా ప్రవేశపెడతారు. వందే మెట్రో కూడా వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది. ఈ రైళ్లలో 12 కోచ్ లు ఉంటాయి.

First Published:  16 Sep 2023 7:59 AM GMT
Next Story