Telugu Global
National

నా పెన్సిల్‌ రేటుకు మీరే కారణం. అమ్మ కొడుతోంది- మోడీకి చిన్నారి లేఖ

మీరు మరీ ఇంతలా ధరలు పెంచేస్తే ఎలా?. మీ వల్ల మా అమ్మ కూడా నన్ను తిడుతోంది అంటూ మోడీని ప్రశ్నిస్తూ లేఖ రాసింది.

నా పెన్సిల్‌ రేటుకు మీరే కారణం. అమ్మ కొడుతోంది- మోడీకి చిన్నారి లేఖ
X

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక బాలిక ప్రధాని నరేంద్రమోడీకి రాసిన ఒక లేఖ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ధరలు పెరుగుద‌ల‌ దెబ్బకు సామాన్యులు అహో లక్ష్మణా.. అని ఆర్తనాదాలు చేస్తున్నా నరేంద్రమోడీ మాత్రం పిండడమే పనిగా పెట్టుకున్నారు. పెద్దలే కాదు.. పిల్లలూ మోడీ పాలనకు బాధితులవుతున్నారు. అలాంటి ఓ బాలిక ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ సంధించింది. మీ కారణంగా మా అమ్మ కొడుతోందంటూ మోడీని ఉద్దేశించి బాలిక కృతీ దూబే లేఖ రాసింది.

గతంలో స్కూల్‌లో ఎన్నోసార్లు తాను పెన్సిల్ పోగొట్టుకున్నానని.. అప్పుడెప్పుడు తన తల్లి తిట్టలేదని.. ఇటీవల మాత్రం పెన్సిల్ పోతే కొడుతోందని లేఖలో బాలిక వివరించింది. ఇందుకు కారణం.. పెన్సిల్ ధరలు బాగా ఎక్కువవడమేనని ఆ బాలిక అభిప్రాయపడింది. మీరు మరీ ఇంతలా ధరలు పెంచేస్తే ఎలా?. మీ వల్ల మా అమ్మ కూడా నన్ను తిడుతోంది అంటూ మోడీని ప్రశ్నిస్తూ లేఖ రాసింది.

''నాపేరు కృతీ దూబే. ఒకటో తరగతి చదువుతున్నా. నా పెన్సిల్, ఎరేజర్ కాస్ట్‌లీ అయిపోయాయి. ఈ ధరలకు మీరే కారణం. మోడీజీ.. పెన్సిల్, ఎరేజర్ ధరలు పెరిగిపోయాయి. వీటిని పొగొట్టుకుంటే అమ్మ నన్ను కొడుతోంది. పెన్సిల్, ఎరేజర్ మళ్లీ ఎవరైనా ఎత్తుకెళ్తే నేను ఏమి చేయాలి?. మ్యాగీ ధర కూడా బాగా పెంచేశారు'' అంటూ ప్రధానికి లేఖ రాసింది ఒకటో తరగతి చదువుతున్న కృతీ. బాలిక సొంతూరు యూపీలోని కనౌజ్ జిల్లా చిబ్రమౌ పట్టణం. చిన్నారి రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story