Telugu Global
National

భారతీయ ఫార్మా కంపెనీకి అమెరికా వార్నింగ్

గుజరాత్ లోని ఈ కంపెనీ ప్లాంట్ లో అన్ని నిబందనలకు విరుద్దంగా జరుగుతున్నాయని FDA, ముంబైలోని ఆ కంపెనీ హెడ్ ఆఫీస్ కు రాసిన లేఖలో పేర్కొంది. మందుల తయారీ సమయంలో సూక్ష్మజీవుల‌ కలుషితాన్ని నిరోధించడానికి ఆ కంపెనీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, మందుల ఉత్పత్తిలో అనేక లోపాలున్నాయని ఆ లేఖలో FDA పేర్కొంది.

భారతీయ  ఫార్మా కంపెనీకి అమెరికా వార్నింగ్
X

ప్రముఖ భారతీయ కంపెనీ సన్ ఫార్మాకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. మందుల తయారీలో కల్తీకి పాల్పడుతోందని, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (FDA ) ఈ వార్నింగ్ ఇచ్చింది.

గుజరాత్ లోని ఈ కంపెనీ ప్లాంట్ లో అన్ని నిబందనలకు విరుద్దంగా జరుగుతున్నాయని FDA,,ముంబైలోని ఆ కంపెనీ హెడ్ ఆఫీస్ కు రాసిన లేఖలో పేర్కొంది. మందుల తయారీ సమయంలో సూక్ష్మజీవుల‌ కలుషితాన్ని నిరోధించడానికి ఆ కంపెనీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, మందుల ఉత్పత్తిలో అనేక లోపాలున్నాయని ఆ లేఖలో FDA పేర్కొంది.

స‌న్ ఫార్మా అనుస‌రిస్తున్న ప‌ద్ధ‌తులు, సౌక‌ర్యాలు, ప్రొడక్షన్ ప్రాసెసింగ్‌, ప్యాకింగ్ విధానాల‌న్నింటిలో క‌ల్తీ జ‌రుగుతున్న‌ట్లు FDA త‌న వార్నింగ్ లేఖ‌లో పేర్కొన్న‌ది.గుజ‌రాత్‌లోని స‌న్ ఫార్మా కంపెనీ ప్లాంట్‌ను గ‌త ఏడాది ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 9 వ‌ర‌కు FDA త‌నిఖీ చేసింది. ఆ త‌ర్వాతే ఈ లేఖ రాసింది.

"మీ సంస్థ నిర్దిష్టంగా నిర్వచించబడిన నిబందనలను పాటించడంలో విఫలమైంది. ప్రాసెసింగ్ ప్రాంతాలలో కాలుష్యం నిరోధించడానికి అవసరమైన నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉండటంలో విఫలమైంది" అని ఆలేఖలో FDA పేర్కొంది.

"మా పరిశీలనలో మీ సంస్థ CGMP (Current Good Manufacturing Practice)కి అనుగుణంగా సమర్థవంతమైన నాణ్యతా వ్యవస్థను నిర్వహించడం లేదని తేలింది" అని FDAపేర్కొంది.

ఈ ఉల్లంఘనలను పరిష్కరించడంలో విఫలమైతే, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తయారు చేసిన మందులను USలోకి అనుమతించడానికి నిరాకరిస్తాము అని FDA తెలిపింది.

First Published:  14 Jan 2023 9:03 AM GMT
Next Story