Telugu Global
National

కొంగ, మనిషి స్నేహం.. వైరలవుతున్న వీడియో

కొంగ ఇల్లు విడిచి వెళ్ళలేదు. ఆరిఫ్ ఎక్కడికి వెళ్ళినా సరే అతడి వెంట వెళ్లడం ప్రారంభించింది. కొంగ, యువకుడి మధ్య ఏర్పడ్డ బంధంపై కొందరు వీడియో తీశారు.

కొంగ, మనిషి స్నేహం.. వైరలవుతున్న వీడియో
X

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. వీడియోలోని వింతను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలోని వింత ఏమిటంటే.. కొంగ మనిషితో స్నేహం చేయడం. పక్షుల్లో పావురాలు, కోళ్లు మనిషితో స్నేహం చేయడం మామూలే. అయితే కొంగలు కూడా స్నేహం చేస్తాయని తాజా ఉదంతం రుజువు చేస్తోంది.

ఓ కొంగ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటం చూసిన యువకుడు దానిని కాపాడాడు. అప్పట్నుంచి ఆ కొంగ యువకుడిని వదల్లేదు. అతడు ఎక్కడికి వెళ్లినా వెంట వెళుతోంది. చివరికి అతడు బైక్ పై వెళ్తున్నా వాహనాన్ని ఫాలో అవుతోంది. కొంగ, మనిషి మధ్య ఏర్పడ్డ స్నేహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథికి చెందిన ఆరిఫ్ ఓ రోజు పొలం వద్దకు వెళ్లగా అతడికి గాయపడిన ఒక భారీ కొంగ కనిపించింది. దీంతో అతడు ఆ కొంగను ఇంటికి తీసుకెళ్లాడు. దాని ఆరోగ్యం బాగయ్యేంతవరకు సపర్యలు చేస్తూ వచ్చాడు. నిదానంగా ఆ కొంగ కోలుకుంది. ఇక ఆ కొంగ ఎగిరిపోతుందని ఆరిఫ్ భావించాడు. అయితే ఆ కొంగ ఇల్లు విడిచి వెళ్ళలేదు. ఆరిఫ్ ఎక్కడికి వెళ్ళినా సరే అతడి వెంట వెళ్లడం ప్రారంభించింది. కొంగ, యువకుడి మధ్య ఏర్పడ్డ బంధంపై కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

First Published:  24 Feb 2023 1:39 PM GMT
Next Story