Telugu Global
National

బెడ్‌పై నోట్ల కట్టలు పరిచి కుటుంబంతో సెల్ఫీ.. పోలీస్ ఆఫీసర్‌పై బదిలీ వేటు

ఇంట్లో ఉన్న 500 రూపాయల నోట్ల కట్టలను బెడ్‌పై పరిచి కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగాడు. దాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముంది ఇది సెన్సేషన్‌గా మారింది.

బెడ్‌పై నోట్ల కట్టలు పరిచి కుటుంబంతో సెల్ఫీ.. పోలీస్ ఆఫీసర్‌పై బదిలీ వేటు
X

ఇంట్లో ఎంత డబ్బు ఉంటే మాత్రం దాన్ని ప‌రిచి ఫొటో దిగుతారా..? ఒకవేళ దిగినా దానిని ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు చేస్తారా..? కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉన్న డబ్బునంతా బెడ్‌పై కట్టలు క‌ట్టలుగా పరిచి కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగాడు. అంతటితో ఆగకుండా ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి చిక్కుల్లో పడ్డాడు. అవినీతికి పాల్పడి ఆ డబ్బు సంపాదించి ఉంటాడన్న అనుమానంతో పైఅధికారులు సదరు పోలీస్ ఆఫీసర్‌పై బదిలీ వేటు వేశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్‌లోని బెహ్తా ముజవార్ పోలీస్ స్టేషన్‌లో రమేష్ చంద్ర సహానీ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. కాగా, ఇటీవల రమేష్ చంద్ర సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫొటో వైరల్ అయ్యింది. అతడు ఇంట్లో ఉన్న 500 రూపాయల నోట్ల కట్టలను బెడ్‌పై పరిచి కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగాడు. దాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముంది ఇది సెన్సేషన్‌గా మారింది.

ఇక ఆ ఫొటో పైఅధికారుల వద్దకు చేరింది. అతడు బెడ్‌పై పేర్చిన డబ్బు కట్టల విలువ 14 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. అతడికి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. అవినీతికి పాల్పడి సంపాదించి ఉంటాడన్న అనుమానంతో రమేష్ చంద్రను పోలీస్ లైన్స్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

కాగా.. ఈ వ్యవహారమై రమేష్ చంద్ర స్పందించాడు. ఆ డబ్బు తాను అక్రమంగా సంపాదించినది కాదని క్లారిటీ ఇచ్చాడు. తనకు తన తల్లి నుంచి వారసత్వంగా దక్కిన ఆస్తి అని చెప్పాడు. ఆ డబ్బు 2021 నవంబర్ నుంచి తన వద్దే ఉన్నట్లు తెలిపాడు.

First Published:  30 Jun 2023 2:01 PM GMT
Next Story