Telugu Global
National

రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపారా..? ఇదెక్కడి సొంత డబ్బా..

ఏకంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయిందని.. దానికి కారణం భారత ప్రధాని నరేంద్రమోదీ అని సెలవిస్తున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.

రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపారా..? ఇదెక్కడి సొంత డబ్బా..
X

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. ఏరోజు ఏం జరుగుతుందోనని ఉక్రెయిన్ బిక్కుబిక్కు మంటుంటే.. ఎక్కడ, ఎంత సైన్యాన్ని నష్టపోవాల్సి వస్తుందేమోనని రష్యా కూడా ఇబ్బందిగానే యుద్దం చేస్తోంది. ఎక్కడా ఏ దశలోనూ యుద్ధం ఆగిపోయిందనే వార్తలు రాలేదు. కొన్నిరోజులపాటు విద్యార్థుల కోసం కాల్పుల విరమణ ప్రకటించారంతే, అది కూడా నామమాత్రంగానే. కానీ ఏకంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయిందని.. దానికి కారణం భారత ప్రధాని నరేంద్రమోదీ అని సెలవిస్తున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.

మోదీ చెప్పారు.. పుతిన్ పాటించారు..?

ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంకకు భారత్ నుంచి అంత సాయం చేస్తేనే, చైనా నౌకకు ఆశ్రయం ఇచ్చి షాకిచ్చింది. పొరుగున ఉన్న ఏ దేశాలయినా భారత్ మాట వింటాయా అంటే అది నమ్మశక్యం కాని మాటే. అలాంటిది భారత ప్రధాని మాటను రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవించారని చెప్పుకుంటున్నారు బీజేపీ నేతలు. యుద్ధంలో విద్యార్థులు బలికాకూడదని రష్యా తీసుకున్న నిర్ణయానికి కూడా క్రెడిట్ మోదీ ఖాతాలో వేయాలనుకుంటున్నారు. అంతే కాదు.. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం కూడా మూడో దేశం ప్రమేయంతో ఆగినట్టు చరిత్రలో లేదని, కానీ మోదీ దాన్ని అమలు చేసి చూపారంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మీమ్స్ పడుతున్నాయి. అప్పట్లో కేఏ పాల్ యుద్ధాలు ఆపానని చెప్పుకున్నారు, ఇప్పుడు మోదీ వల్ల యుద్ధాలు ఆగిపోతున్నాయా అంటున్నారు.

సెల్ఫ్ డబ్బా మితిమీరుతోందా..?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం సోషల్ మీడియాకు మంచి మేతగా మారింది. మోదీ ఘనకీర్తి ఇదీ అంటూ అన్నిరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. మోదీ అప్పట్లోనే పుట్టి ఉంటే భారత్ - పాక్ యుద్ధాన్ని కూడా ఆపేసి ఉండేవారంటూ సెటైర్లు పేలుస్తున్నారు. అసలు బ్రిటీష్ వారిని భారత్ లో అడుగుపెట్టనిచ్చేవారు కాదని అంటున్నారు. బీజేపీ నాయకులు మాత్రం యథాలాపంగా మోదీకి స్తోత్రాలు చేస్తున్నారు, అతి పొగడ్తలతో నెటిజన్లకు అడ్డంగా బుక్కైపోతున్నారు.

First Published:  29 Aug 2022 1:59 AM GMT
Next Story