Telugu Global
National

లోకేష్‌కి పోటీగా అమిత్ షా.. పప్పు పేరుతో ట్రోలింగ్..

అక్టోబర్ మొదటి వారంలో దుర్గాపూజ సందర్భంగా అమిత్ షా ని మరింతగా టార్గెట్ చేయాలనుకుంటున్నారు టీఎంసీ నేతలు. ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు అనే పేరుతో ఉన్న టీ షర్ట్ లను ప్రజలకు పంచి పెట్టాలని నిర్ణయించారు.

లోకేష్‌కి పోటీగా అమిత్ షా.. పప్పు పేరుతో ట్రోలింగ్..
X

ఏపీలో పప్పు అంటూ లోకేష్ ని బాగా ఫేమస్ చేశారు వైసీపీ నాయకులు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని పప్పు అంటూ ట్రోల్ చేసేవారు బీజేపీ నేతలు. కానీ ఇప్పుడు అమిత్ షా ని ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు అంటూ టార్గెట్ చేశారు టీఎంసీ నేతలు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు, నేరుగా కూడా అమిత్ షా ని టార్గెట్ చేశారు టీఎంసీ నేతలు. ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు అని ప్రింట్ వేసిన టీ షర్ట్ లను మార్కెట్లోకి తెచ్చారు. దానిపై కార్టూన్ టైప్ లో అమిత్ షా బొమ్మ కూడా వేశారు. ఈ టీ షర్ట్ లను టీఎంసీ కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు.

అభిషేక్ ప్రతీకారం..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీని ఇటీవల బీజేపీ టార్గెట్ చేసింది. బెంగాల్ లో ఇప్పటికే టీఎంసీ మంత్రులపై దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించిన కేంద్రం, అభిషేక్ బెనర్జీని పశువుల స్మగ్లింగ్ స్కామ్ లో ఇరికించింది. ఇటీవలే ఈడీ గంటలతరబడి అభిషేక్ బెనర్జీని విచారించింది కూడా. ఆ తర్వాత టీఎంసీ నుంచి ఎదురుదాడి పెరిగింది. నేరుగా అభిషేక్ బెనర్జీ రంగంలోకి దిగారు. అమిత్ షా ని టార్గెట్ చేశారు.

పప్పు కాక ఇంకేమనాలి..?

ఢిల్లీలో క్రైమ్ రేటు దేశంలోనే ఎక్కువగా ఉందని, ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ అధీనంలోనే ఉంటారని, ఇంత నిర్లక్ష్యానికి కారణమైన హోం మంత్రిని పప్పు కాక ఇంకేమనాలని ప్రశ్నిస్తున్నారు అభిషేక్ బెనర్జీ. అమిత్‌ షా అందరికీ జాతీయవాదాన్ని బోధిస్తారని, కానీ ఆయన కొడుకు జైషా మాత్రం భారత జెండా పట్టుకోవ‌డానికి ఇబ్బంది పడ్డాడని ముందు అమిత్ షా తన కొడుకుకి మంచి పద్ధతులు నేర్పాలని చెప్పారు.

అక్టోబర్ లో టార్గెట్..

అక్టోబర్ మొదటి వారంలో దుర్గాపూజ సందర్భంగా అమిత్ షా ని మరింతగా టార్గెట్ చేయాలనుకుంటున్నారు టీఎంసీ నేతలు. అమ్మవారి దర్శనాల సమయంలో టీఎంసీ కార్యకర్తలతోపాటు, ప్రజలకు కూడా ఈ టీ షర్ట్ లు పంచి పెట్టాలని నిర్ణయించారు. పశ్చిమబెంగాల్ లో దీన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. టీఎంసీ నేతల్ని ఈడీ, సీబీఐ పేరుతో బెదిరిస్తున్నందుకు నిరసనగా.. ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు అనే టీ షర్ట్ లతో సంచలనం సృష్టిస్తున్నారు.

First Published:  9 Sep 2022 10:12 AM GMT
Next Story