Telugu Global
National

రాహుల్ గాంధీపై ఉద్ధ‌వ్ బృందం ప్ర‌శంస‌లు..కూట‌మికి ఢోకా లేన‌ట్టేనా ?

అనారోగ్యంతో ఉన్న శివసేన నేత సంజయ్ రౌత్ ను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరమార్శించిన‌ నేపథ్యంలో రౌత్ స్పందించారు. ''కొన్ని విషయాలపై బలమైన అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, మీ రాజకీయ స‌హ‌చ‌రుడి గురించి వాక‌బు చేయ‌డం మానవత్వానికి సంకేతం. రాహుల్‌జీ తన యాత్రలో ప్రేమ, కరుణపై దృష్టి పెడుతున్నారు కాబ‌ట్టే ఆయ‌న పాద యాత్ర‌లో భారీ స్పందన వస్తోంది" అని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీపై ఉద్ధ‌వ్ బృందం ప్ర‌శంస‌లు..కూట‌మికి ఢోకా లేన‌ట్టేనా ?
X

వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం విరుచుకుప‌డింది. ఉద్ధ‌వ్ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు త‌మ‌కు ఆమోదం కాద‌ని ఖండించారు. దీంతో మ‌హావికాస్ అఘాడీ కూట‌మి చీలిపోతుంద‌నే అనుమానాలు వ‌చ్చాయి. తాజాగా శివ‌సేన ఉద్ధ‌వ్ వ‌ర్గం నాయ‌కుడు ఎంపి సంజ‌య్‌రౌత్ స్పంద‌న చూస్తే ఎంవిఎ కూట‌మికి ఎటువంటి ఢోకా లేద‌ని తెలుస్తోంది.

సంజ‌య రౌత్ సోమ‌వారంనాడు ఓ ట్వీట్ చేస్తూ.. ఈ రోజు రాహుల్ గాంధీ తనకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగారని పేర్కొన్నారు. 'భారత్‌ జోడో యాత్రలో బిజీగా ఉన్నా రాహుల్‌ రాత్రి నాకు ఫోన్‌ చేశారు. నా ఆరోగ్యం గురించి అడిగారు. 'మీ గురించి ఆందోళన చెందుతున్నాం' అని చెప్పారు. రాజకీయ మిత్రుడిని తప్పుడు కేసులో ఇరికించారని, 110 రోజుల పాటు జైలులో చిత్రహింసలకు గురయ్యారు'' అని సాటి మ‌నిషిగా స్పందించార‌ని సంజయ్ రౌత్ మరాఠీలో ట్వీట్ చేశారు.

"కొన్ని విషయాలపై బలమైన అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, మీ రాజకీయ స‌హ‌చ‌రుడి గురించి వాక‌బు చేయ‌డం మానవత్వానికి సంకేతం.. రాజకీయాల్లో క‌ఠిన స‌మ‌యాల్లో అలాంటి ప‌రామ‌ర్శ‌లు చాలా అరుదుగా ఉంటాయి. రాహుల్‌జీ తన యాత్రలో ప్రేమ, కరుణపై దృష్టి పెడుతున్నారు కాబ‌ట్టే ఆయ‌న పాద యాత్ర‌లో భారీ స్పందన వస్తోంది" అని సంజ‌య్ రౌత్ పేర్కొన్నాడు.

హిందుత్వవాది అయిన వీర్ సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఉద్ధ‌వ్ థాకరే స్పందిస్తూ త‌మ సంకీర్ణంపై ప్రభావితం చేయగలవని హెచ్చరించారు. రాహుల్ గాంధీ చారిత్ర‌క వాస్త‌వాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించారు త‌ప్ప ఎటువంటి విద్వేష వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని కాంగ్రెస్ నేత జై రాం ర‌మేష్ దిద్దుబాటుకు ప్ర‌య‌త్నించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సంజ‌య్ రౌత్ కు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించ‌డం, దానిపై సేన నాయకుడు సంజ‌య్ రౌత్ బహిరంగ ప్రశంసలు చూస్తుంటే ఇరు పార్టీల మ‌ధ్య స‌యోద్య‌కు ఢోకాలేద‌ని అర్ధ‌మ‌వుతోందంటున్నారు.

గ‌త వారం రాహుల్ మాట్లాడుతూ.. సావ‌ర్క‌ర్ బ్రిటిష్ పాల‌కుల‌కు భ‌య‌ప‌డి క్ష‌మాప‌ణ‌లు అడుగుతూ లేఖ రాశారంటూ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

First Published:  21 Nov 2022 6:03 AM GMT
Next Story