Telugu Global
National

చేతులు కలిపిన ఉద్దవ్ ఠాక్రే, ప్రకాష్ అంబేద్కర్

ప్రకాష్ అంబేద్కర్, భీమ్ రావ్ అంబేద్కర్ మనవడు .ఆయన పార్టీ వంచిత్ బహుజన్ అఘాడి కి దళిత వర్గంలో మంచి పట్టు ఉంది. ఉద్దవ్, అంబేద్కర్ రెండు నెలలుగా చర్చలు సాగిస్తున్నారు. ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చి బహిరంగ ప్రకటన చేశారు.

చేతులు కలిపిన ఉద్దవ్ ఠాక్రే, ప్రకాష్ అంబేద్కర్
X

మహారాష్ట్రలో కొత్త రాజకీయ పొత్తుకు తెరలేచింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ప్రకాష్ అంబేద్కర్ చేతులు కలిపారు. రాబోయే ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఉద్దవ్ ఠాక్రే శివసేన, ప్రకాష్ అంబేద్కర్ వంచిత్ బహుజన్ అఘాడి (VBA) లు నిర్ణయించాయి.

ప్రకాష్ అంబేద్కర్, భీమ్ రావ్ అంబేద్కర్ మనవడు .ఆయన పార్టీ వంచిత్ బహుజన్ అఘాడి కి దళిత వర్గంలో మంచి పట్టు ఉంది. ఉద్దవ్, అంబేద్కర్ రెండు నెలలుగా చర్చలు సాగిస్తున్నారు. ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చి బహిరంగ ప్రకటన చేశారు.

"ఈరోజు జనవరి 23, బాలాసాహెబ్ థాకరే జయంతి. మహారాష్ట్రలోని చాలా మంది ప్రజలు మేము కలవాలని కోరుకున్నారు. అందువల్లే ప్రకాష్ అంబేద్కర్, నేను కూటమిని ఏర్పాటు చేయడానికి ఈ రోజు నిర్ణయించుకున్నాము" అని థాకరే విలేకరులతో అన్నారు.

"మా తాత, ప్రకాష్ అంబేద్కర్ తాత సహచరులు. వారు సామాజిక సమస్యలపై పోరాడారు. ఠాక్రే, అంబేద్కర్‌లకు చరిత్ర ఉంది. ఇప్పుడు వారి భవిష్యత్ తరాలైన మేము దేశంలోని ప్రస్తుత సమస్యలపై పోరాడటానికి చేతులు కలిపాము" అని అన్నారాయన.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో అధికార ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని సేన, బీజేపీ కూటమితో ఈ కూటమి తలపడనుంది.

ఈ కూటమి దేశంలో కొత్త రాజకీయాలకు నాంది అని అంబేద్కర్ అన్నారు. ''మేము సామాజిక సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తున్నాము, ఈ పోరాటాల ఆధారంగా గెలుస్తామా లేదా అనేది ఓటర్ల చేతుల్లో ఉంది''. అని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.

కాగా ఇప్పటి వరకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ లతో కలిసి మహా వికాస్ అగాడీ కూటమిలో ఉంది. మరి ఆ రెండు పార్టీలు వీరితో కలిసి వస్తాయా లేదా అనేది ఇంకా తేల లేదు.

''ఇప్పటికి మేమిద్దరం మాత్రమే కలిశాం. కాంగ్రెస్ ఇంకా పొత్తుకు అంగీకరించలేదు. శరద్ పవార్ కూడా కూటమిలో చేరతారని నేను ఆశిస్తున్నాను' అని అంబేద్కర్ తెలిపారు.

First Published:  23 Jan 2023 11:43 AM GMT
Next Story