Telugu Global
National

సుధామూర్తితో మీట్ అండ్ గ్రీట్.. ఎంట్రీఫీజు వసూలు చేసిన కిలేడీలు

ఇటీవల సుధామూర్తి ప్రసంగాలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కొందరు ఆమె పేరుతో బిజినెస్ మొదలు పెట్టారు. ఆమె హాజరవుతున్నారంటూ ప్రచారం చేసి, ఆయా కార్యక్రమాలకు ఎంట్రీ ఫీజు కూడా వసూలు చేస్తున్నారు.

సుధామూర్తితో మీట్ అండ్ గ్రీట్.. ఎంట్రీఫీజు వసూలు చేసిన కిలేడీలు
X

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య, రచయిత్రి, బ్రిటన్ ప్రధానికి స్వయానా అత్త, సంఘ సేవకురాలు.. ఇలా సుధామూర్తికి సమాజంలో ఓ గుర్తింపు ఉంది. ఆమె పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరవుతుంటారు. తన ప్రసంగాలతో ఆకట్టుకుంటారు. అలాంటి వ్యక్తితో మీట్ అండ్ గ్రీట్ అంటే చాలామంది మహిళలు ఉత్సాహం చూపిస్తారు కూడా. ఆ ఉత్సాహాన్ని క్యాష్ చేసుకుంది శృతి అనే ఓ కిలేడీ. అమెరికాలో ఈనెల 26న ఆమెతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి ప్రచారం చేసుకుంది, పనిలో పనిగా ఒక్కొక్కరి నుంచి 40 డాలర్ల ఎంట్రీ ఫీజు కూడా వసూలు చేసింది. ఆ కార్యక్రమం గురించి సోషల్ మీడియాలో తెలుసుకున్న సుధామూర్తి, తనకు తెలియకుండానే తనతో మీట్ అండ్ గ్రీట్ ఏంటని అవాక్కయ్యారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కన్నడకూట నార్తర్న్ కాలిఫోర్నియా అనే సంస్థ కూడా తన పేరుని దుర్వినియోగం చేసిందంటూ సుధామూర్తి గతంలో బెంగళూరు జయనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ తమ 50వ వార్షికోత్సవానికి రావాలంటూ సుధామూర్తికి ఆహ్వానం పంపింది. అయితే ఆమె రావడం కుదరదని తెలిపింది. కానీ సదరు సంస్థ సుధామూర్తి చీఫ్ గెస్ట్ అంటూ ప్రచారం మొదలు పెట్టింది. లావణ్య అనే మహిళ సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శిగా పరిచయం చేసుకుని ఈ వ్యవహారం అంతా నడిపినట్టు బయటపడింది.

సుధామూర్తి పేరుతో బిజినెస్...

ఇటీవల సుధామూర్తి ప్రసంగాలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకే ఆమె హాజరయ్యే కార్యక్రమాలంటే చాలామందికి ఆసక్తి ఏర్పడింది. ఆమెతో కలసి ఫొటోలు దిగేందుకు యువత కూడా ఆసక్తి చూపించడం విశేషం. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కొందరు ఆమె పేరుతో బిజినెస్ మొదలు పెట్టారు. ఆమె హాజరవుతున్నారంటూ ప్రచారం చేసి, ఆయా కార్యక్రమాలకు ఎంట్రీ ఫీజు కూడా వసూలు చేస్తున్నారు. మనదేశంతోపాటు విదేశాల్లో కూడా ఇలాంటి మోసాలు జరగడం విశేషం. ఇలాంటి పనులు చేస్తున్న ఇద్దరు మహిళల కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. వారు అమెరికాలో ఉన్నారా, లేక భారత్ లోనే ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.

First Published:  25 Sep 2023 3:28 AM GMT
Next Story