Telugu Global
National

రాహుల్ ను ప్రశంసలతో ముంచెత్తిన‌ త్రుణముల్ ఎంపీ శతృఘ్న సిన్హా

"అతని వ్యక్తిత్వం యువతకు వివేకానికి చిహ్నంగా మారింది. దేశం ఇంతకు ముందు ఇలాంటి యాత్రను చూడలేదు. అతని లక్ష్యం మంచిది.నేను అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని శ‌తృఘ్న సిన్హా రాహుల్ గాంధీ గురించి అన్నారు.

రాహుల్ ను ప్రశంసలతో ముంచెత్తిన‌ త్రుణముల్ ఎంపీ శతృఘ్న సిన్హా
X

ఆశ్చర్యకరంగా త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ శతృఘ్న సిన్హా రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విప్లవాత్మకమైనదని ఆయన అన్నారు.

ఒకవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ విపక్షాల ప్రధాని అభ్యర్థి కావాలని యోచిస్తుంటే శతృఘ్న సిన్హా, రాహుల్‌ను, ఆయన యాత్రను ప్రశంసించడం దుమారం రేపుతోంది. శతృఘ్న సిన్హా వ్యాఖ్యలు మమతను చికాకుపెట్టే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.

"అతని వ్యక్తిత్వం యువతకు వివేకానికి చిహ్నంగా మారింది. దేశం ఇంతకు ముందు ఇలాంటి యాత్రను చూడలేదు. అతని లక్ష్యం మంచిది.నేను అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని శ‌తృఘ్న సిన్హా రాహుల్ గాంధీ గురించి అన్నారు.

శత్రుఘ్న సిన్హా బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి గతేడాది ఎంపీగా ఎన్నికయ్యారు. గతేడాది టీఎంసీలో చేరారు. గతంలో 2019లో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. సిన్హా చివరకు పార్టీని విడిచిపెట్టే ముందు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా 3,500 కి.మీలకు పైగా ప్రయాణించే లక్ష్యంతో చేపట్టిన భారత్ జోడో యాత్రను ప్రశంసించిన‌ పలువురు నాయకులు,ప్రముఖులో సిన్హా కూడా చేరారు.

క్రిస్మస్ సందర్భంగా, నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కూడా ఎర్రకోట వద్ద రాహుల్ గాంధీతో కలిసి బిజెపిని లక్ష్యంగా చేసుకున్న భారత్ జోడో యాత్రకు, రాహుల్ గాంధీకి మద్దతునిచ్చాడు. ఆదివారం, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్, ఇతర మాజీ సైనిక అధికారులు హర్యానాలో రాహుల్ గాంధీతో కలిసి కవాతు చేస్తూ కనిపించారు.

జనాలతో కాంగ్రెస్ అనుబంధాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ప్రారంభించిన యాత్ర ఈ నెలాఖరులో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగియనుంది.

First Published:  9 Jan 2023 2:24 AM GMT
Next Story