Telugu Global
National

టమాటా దొంగలు.. జోక్ కాదు ఇది నిజం

మార్కెట్లలో కూడా అన్ని కూరగాయలు ఒకచోట ఉంటే, టమాటాలు మాత్రం కాస్త విడిగా పెడుతున్నారు. ఒకటీ అర టమాటా కూడా ఎవరూ తీసుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వ్యాపారులు.

టమాటా దొంగలు.. జోక్ కాదు ఇది నిజం
X

రేట్లు పెరిగినప్పుడల్లా టమాటాపై సోషల్ మీడియాలో జోకులు విపరీతంగా పేలుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది జోక్ కాదు, నిజం. దేశంలో టమాటా దొంగలు పడ్డారు. కూరగాయల మార్కెట్ నుంచి, టమాటా తోటల వరకు దొంగలు తమ టాలెంట్ చూపిస్తున్నారు. టమాటాలు చోరీ చేస్తున్నారు.

మహబూబాబాద్ మార్కెట్లో..

మహబూ­బాబాద్‌ జిల్లా డోర్నకల్‌ కూరగా­యల మార్కెట్‌ లోని పలు దుకా­ణా­ల్లో ఇటీవల టమాటాలు మాయమవుతున్నాయి. గాంధీసెంటర్‌­ లోని కూరగాయల మార్కెట్‌ లో రాత్రి వేళల్లో దుకా­­ణా­లకు తాత్కా­లికంగా నెట్‌ ఏర్పాటు చేస్తారు. గతంలో ఎప్పుడూ ఇక్కడ దొంగతనాలు జరగలేదు. కానీ టమాటా రేట్లు భారీగా పెరిగిపోవడంతో ఇక్కడ దొంగలు హస్తలాఘవం చూపించారు. రాత్రివేళ మార్కెట్లో టమాటాలు ఎత్తుకెళ్తున్నారు. తెల్లవారి చూసే సరికి టమాటాలు, పచ్చిమిర్చి మాత్రం ఖాళీ అవుతున్నాయి. మిగతా కూరగాయల జోలికి దొంగలు వెళ్లకపోవడం విశేషం.

కర్నాటకలో పంట చోరీ..

కర్నాటకలో హసన్‌ జిల్లా బేలూరు తాలూకా గోణి సోమనహళ్లి గ్రామంలో టమాటా పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. పంట పక్వానికి వస్తుండటంతో రెండ్రోజుల్లో టమాటాలు కోసి మార్కెట్ కి తరలించేందుకు రైతు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంతలో రాత్రికి రాత్రే టమాటాలు మాయమైపోయాయి. దొంగలు టమాటాలు జాగ్రత్తగా కోసుకుని తీసుకెళ్లిపోయారు. రేటు పెరిగినా చేతికొచ్చిన పంట అమ్ముకోలేకపోయానని ఆ రైతు లబోదిబోమంటున్నాడు. లక్షన్నర రూపాయల పంటను దొంగలు దోచుకెళ్లారని పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు.

సీసీ కెమెరాల పర్యవేక్షణ..

మార్కెట్లలో కూడా అన్ని కూరగాయలు ఒకచోట ఉంటే, టమాటాలు మాత్రం కాస్త విడిగా పెడుతున్నారు. ఒకటీ అర టమాటా కూడా ఎవరూ తీసుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వ్యాపారులు. ఇక పంట తోటలకు సీసీ కెమెరాల రక్షణ ఏర్పాటు చేసుకుంటున్నారు రైతులు. కర్నాటకలోని హావేరి జిల్లాలో టమాాటా తోటలకు సీసీ కెమెరాలు బిగించారు. ప్రత్యేకంగా కాపలా కూడా ఏర్పాటు చేసుకున్నారు. రేటు తగ్గేవరకు టమాటాని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిందే.

First Published:  6 July 2023 1:31 AM GMT
Next Story