Telugu Global
National

Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి

Singer Mangli Car Incident: మంగ్లీ త‌న పాట‌లు పాడేసి వేదిక దిగిన త‌రువాత‌ యువకులు ఒక్క‌సారిగా తోసుకువ‌చ్చారు. పోలీసులు లాఠీచార్జి చేసి చెద‌ర‌గొట్టారు. కారులో మంగ్లీ బ‌య‌లుదేర‌గా యువకులు కారుపైకి రాళ్లు విసిరారు.

Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి
X

ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీపై మ‌ళ్లీ దాడికి తెగ‌బ‌డ్డారు యువ‌కులు. ఈసారి క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఈ దాడి జ‌ర‌గ‌డం విస్మ‌యం గొలుపుతోంది. బళ్లారి ఉత్సవ్ కార్యక్రమానికి మంగ్లీ హాజ‌ర‌య్యారు.

శనివారం రాత్రి బళ్లారిలోని మున్సిపల్ కళాశాల మైదానంలో ఈ ఉత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి క‌న్న‌డ సినీ ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు.

మంగ్లీ త‌న పాట‌లు పాడేసి వేదిక దిగిన త‌రువాత‌ యువకులు ఒక్క‌సారిగా తోసుకువ‌చ్చారు. పోలీసులు లాఠీచార్జి చేసి చెద‌ర‌గొట్టారు. కారులో మంగ్లీ బ‌య‌లుదేర‌గా యువకులు కారుపైకి రాళ్లు విసిరారు. కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

పోలీసులు మ‌ళ్లీ క‌ల్పించుకుని మంగ్లీని సుర‌క్షితంగా త‌ర‌లించారు. గ‌తంలోనూ క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా త‌న‌కు క‌న్న‌డ స‌రిగా రాద‌ని చెప్ప‌డం వివాదంగా మారింది. ఏపీలోనూ మంగ్లీ ప‌ర్య‌ట‌న‌లు, షోలు వివాదాల‌కు వేదిక‌ల‌య్యాయి. సెల్ఫీలు గొడ‌వ‌తో ఫోను ప‌గ‌ల‌గొట్టిన గొడ‌వ కూడా జ‌రిగింది.

First Published:  22 Jan 2023 1:49 PM GMT
Next Story