Telugu Global
National

ఒకేరోజు కుప్పకూలిన 3 యుద్ధ విమానాలు..

రాజస్థాన్‌ లోని భరత్‌ పూర్‌ లో మరో యుద్ధ విమానం కూలిపోయింది. మొదట అది ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ అనుకున్నారు. కానీ అది కూడా వాయుసేనకు చెందిన యుద్ధవిమానమేనని తేలింది

ఒకేరోజు కుప్పకూలిన 3 యుద్ధ విమానాలు..
X

భారత వాయుసేనకు చెందిన మూడు యుద్ధ విమానాలు గంటల వ్యవధిలో కుప్పకూలాయి. మధ్యప్రదేశ్‌ లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్‌ జెట్లు కూలిపోగా, రాజస్థాన్‌లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురికావడం దురదృష్టకరం. ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడగా మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు.

మధ్యప్రదేశ్ లో రోజువారీ శిక్షణకోసం గ్వాలియర్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి సుఖోయ్‌-30, మిరాజ్‌ 2000 విమానాలు బయలుదేరాయి. విన్యాసాలు చేస్తున్న క్రమంలో ఆ రెండు విమానాలు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నట్టు తెలుస్తోంది. ఆ విమానాలు రెండూ మొరెనా ప్రాంతంలో కూలిపోయినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సుఖోయ్‌లో ఇద్దరు, మిరాజ్‌లో ఒక పైలట్‌ ఉన్నట్లు రక్షణవర్గాలు వెల్లడించాయి. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. మరో పైలట్‌ కోసం గాలిస్తున్నారు. గాయపడినవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.


రాజస్థాన్ లో మరో ప్రమాదం..

రాజస్థాన్‌ లోని భరత్‌ పూర్‌ లో మరో యుద్ధ విమానం కూలిపోయింది. మొదట అది ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ అనుకున్నారు. కానీ అది కూడా వాయుసేనకు చెందిన యుద్ధవిమానమేనని తేలింది. భరత్ పూర్ ప్రాంతంలోని ఉచ్చయిన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మొదట ఇది చార్టర్డ్ ఫ్లైట్ అనుకున్నారు. తర్వాత ఇది ఫైటర్ జెట్ అని తేలింది. ఈ ఘటనపై కూడా దర్యాప్తు ప్రారంభించారు.

First Published:  28 Jan 2023 8:12 AM GMT
Next Story