Telugu Global
National

టీచర్లకు జీతాలివ్వడం కోసం కూలీపని చేస్తున్న లెక్చరర్

నగేషు పేద పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. కూలీగా పనిచేసి వచ్చిన డబ్బుతో ఈ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తున్నారు. ప్రతి రోజూ నాగేషు ఉదయం ఒక ప్రైవేట్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తారు. ఆ తర్వాత తన‌ కోచింగ్ సెంటర్‌లో పిల్లలకు బోధిస్తారు. రాత్రి వేళల్లో రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేస్తారు.

టీచర్లకు జీతాలివ్వడం కోసం కూలీపని చేస్తున్న లెక్చరర్
X

ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన నగేషు పాత్రో పగలు ఓ ప్రైవేట్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌గా, రాత్రి బెర్హంపూర్ రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ పని అతను ఎక్కువ డబ్బు సంపాదించడానికి చేయడం లేదు పేద పిల్లల చదువుల ఖర్చు భరించడానికి ఇలా చేస్తున్నాడు.

31 ఏళ్ల నగేషు పేద పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. కూలీగా పనిచేసి వచ్చిన డబ్బుతో ఈ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తున్నాడు. ప్రతి రోజూ నాగేషు ఉదయం ఒక ప్రైవేట్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తారు, ఆ తర్వాత తన‌ కోచింగ్ సెంటర్‌లో పిల్లలకు బోధిస్తారు. రాత్రి వేళల్లో రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేస్తారు.

కరోనా మహమ్మారి సమయంలో తన ఇంటి వద్ద ఖాళీగా కూర్చోకుండా, పేద పిల్లలకు ఉచితంగా బోధించడం ప్రారంభించానని పాత్రో చెప్పారు. పిల్లల సంఖ్య పెరగడంతో అతను 8 నుండి 12 తరగతి పిల్లలకు కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాడు. ఇక్కడి పిల్లలకు హిందీ, ఒరియా భాషలను స్వయంగా నేర్పిస్తున్నారు.

నగేషు కూలీ పని చేస్తూ నెలకు రూ.10 వేల నుంచి 12 వేల వరకు, కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తూ రూ.8,000 సంపాదిస్తున్నాడు. అందులో కోచింగ్ సెంటర్ లోని నలుగురు టీచర్లకు జీతాలు పోగా మిగిలిన డబ్బులను కుటుంబ ఖర్చులు సరిపెట్టుకుంటున్నారు.

నగేషు పాత్రో ఒక పేద కుటుంబం నుండి వచ్చాడు. 2006లో హైస్కూల్ పరీక్ష రాయలేకపోయాడు. అతని తండ్రి గొర్రెల కాపరిగా పని చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాగా చదువుకోవాలనేది అతనికి దూరమైన కల. అప్పటి నుంచి పిల్లలకు చదువు చెప్పాలనే లక్ష్యంతో ముందుకు సాగారు.

''కాలేజీ టీచర్‌గా ఉంటూ పోర్టర్‌గా పని చేయడం గురించి పాత్రో మాట్లాడుతూ, ప్రజలు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. పిల్లలకు చదువు నేర్పించడం నాకు ఇష్టం. పేద కుటుంబాల పిల్లలు డబ్బు లేకపోవడంతో చదువును మధ్యలోనే వదిలేయడం నాకు ఇష్టం లేదు.'' అన్నారాయన‌

పాత్రో 2011లో రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా పేరు నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత 2012లో కరస్పాండెన్స్ కోర్సు ద్వారా 12వ తరగతి పరీక్షలు రాశాడు. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక, బెర్హంపూర్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఆయన కొంత కాలం సూరత్ లోని ఓ మిల్లులో, హైదరాబాద్ లోని ఓ మాల్ లో కూడా పనిచేశాడు.

కూలీ పని చేస్తూనే చదువు పూర్తి చేశారు నగేషు. ప్రస్తుతం ప్రజలు ట్రాలీ బ్యాగ్‌లు, ఎస్కలేటర్‌లను ఉపయోగించడం ప్రారంభించారని, దీని వల్ల కూలీగా తన సంపాదన తగ్గిపోయిందన్నారాయన.

ఈ మధ్య‌ మూన్ లైట్ అనే పదం చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో రెండు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను ఉద్దేశించి ఈ పదం వాడుతున్నారు. అలా చూస్తే ఈ నగేషు ది కూడా మూన్ లైట్ వ్యవహారమే. అయితే ఈ మూన్ లైట్ లో సంపాదించి కూడబెట్టాలనో, ఈఎమ్ ఐ లు కట్టి ఇళ్ళూ, వస్తువులూ కొనుక్కోవాలనే తపన లేదు. ఇందులో పేదరికం ఉంది...పేదలపై ప్రేమ ఉంది...పేదలను చదివించాలనే కోరిక ఉంది...ఇతరుల కోసం త్యాగం చేసే గుణం ఉంది.

First Published:  13 Dec 2022 7:00 AM GMT
Next Story