Telugu Global
National

అనేక సౌకర్యాలతో పాటు, సైన్స్ కాన్సెప్ట్‌లను బోధిస్తోన్న హైదరాబాద్‌లోని పార్క్

గురుత్వాకర్షణ సిద్దాంతాలను వివరించడానికి స్వింగ్ బార్ ఉపయోగించారు.ధ్వనిపై అవగాహనను ఏర్పర్చడానికి సుత్తి, లోహాలు, ఇతర ముక్కలు ఏర్పాటు చేశారు. ఇవి ధ్వని తరంగాలు ఎలా ప్రయాణిస్తాయో అర్థం చేసుకోవడంలో పిల్లలకు సహాయపడతాయి.

అనేక సౌకర్యాలతో పాటు, సైన్స్ కాన్సెప్ట్‌లను బోధిస్తోన్న హైదరాబాద్‌లోని  పార్క్
X

స్వచ్చమైన గాలి, వినోద సౌకర్యాలు మాత్రమే కాదు హైటెక్ సిటీలోని ఈ విశాలమైన కొత్త పార్క్ సందర్శకులకు మరిన్ని ఆఫర్లను అందిస్తుంది.

సైబర్ టవర్స్ సమీపంలో మూడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇంటరాక్టివ్ సైన్స్ పార్క్ ను చాలా సృజనాత్మకంగా నిర్మించారు. అనేక రకాల సదుపాయాలతోపాటు సైన్స్ సిద్దాంతాలను బోధించడానికి ఏర్పాట్లు కూడా చేశారు ఈ పార్క్ లో.

గురుత్వాకర్షణ సిద్దాంతాలను వివరించడానికి స్వింగ్ బార్ ఉపయోగించారు.ధ్వనిపై అవగాహనను ఏర్పర్చడానికి సుత్తి, లోహాలు, తదితర ఇతర ఏర్పాట్లు చేశారు. ఇవి ధ్వని తరంగాలు ఎలా ప్రయాణిస్తాయో అర్థం చేసుకోవడంలో పిల్లలకు సహాయపడతాయి.

అలేగే చలన నియమాలను బోధించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలు ఉన్నాయి.

ఇక్కడ ల్యాప్ టాప్ లతో పని చేసుకోవడానికి వైఫై, సీటింగ్ , ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేశారు.

చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్కును రూపొందించామని, అన్ని వయసుల వారికి స్టోర్ సౌకర్యాలు, వినోద సౌకర్యాలు ఉన్నాయని GHMC అధికారి తెలిపారు.

పార్క్ చుట్టుపక్కల అనేక ఐటీ కంపెనీలు, హాస్టళ్ళు ఉన్నాయి. అందువల్ల‌, పార్క్ లోపల వర్క్‌స్టేషన్లు అభివృద్ధి చేసారు .

అదేవిధంగా ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు చుట్టుపక్కల ఉన్న హాస్టళ్లలో నివసించే వారికి, పార్కు పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చే అటెండర్ల కోసం ఫలహారశాల ఏర్పాటు చేయనున్నారు.

"ప్రజలు ఇక్కడ సమయం గడపడానికి, ఆహారం, త్రాగునీరు వంటి సేవలను అందించడంతోపాటు మంచి వాతావరణాన్ని సృష్టించడం మా ప్రణాళిక" అని GHMC అధికారి తెలిపారు.

పార్క్ సమీపంలో అనేక అపార్ట్‌మెంట్లు, ఇళ్ళు ఉన్నందున సైన్స్ పార్క్‌లో ఓపెన్ జిమ్‌తో పాటు పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం కూడా ఉంది.

సీనియర్ సిటిజన్లు,ఇతరుల‌ కోసం ర్యాంప్‌లు, నడక మార్గాలు, గెజిబోలు, నీటి క్యాస్కేడ్, పచ్చదనం, వాష్‌రూమ్లు, భద్రతా గది ఉన్నాయి.

ఒకదానిపై ఒకటి దొంతరులుగా ఉన్న పుస్తకాలపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులు తదితర‌ సౌందర్యపరంగా రూపొందించిన శిల్పాలతో ఈ పార్క్ నిండి ఉంది.

First Published:  5 Feb 2023 12:04 AM GMT
Next Story