Telugu Global
National

'కోట్లకు అమ్ముడుపోయిన ద్రోహులు చేసిన నీచమైన పని ఇది'

మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నేత ఆదిత్య ఠాక్రే, ముఖ్యమంత్రి నేత ఏక్ నాథ్ షిండే పై మండిపడ్డారు. పార్టీ పేరును, ఎన్నికల గుర్తును ఎన్నికల కమిషన్ ఫ్రీజ్ చేయడానికి ఎక్ నాథ్ షిండే వంటి ద్రోహులే కారణమని ఆరోపించారు.

కోట్లకు అమ్ముడుపోయిన ద్రోహులు చేసిన నీచమైన పని ఇది
X

శివసేన పార్టీ పేరును, ఎన్నికల గుర్తును ఎన్నికల కమిషన్ ఫ్రీజ్ చేయడం పట్ల ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఇది ద్రోహుల పని అని మండి పడ్డారు.

''కోటకు అమ్ముడు పోయిన‌ దేశద్రోహులు నేడు శివసేన పేరు, చిహ్నాన్ని స్తంభింపజేసే నీచమైన, సిగ్గులేని చర్యకు పాల్పడ్డారు. దీన్ని మహారాష్ట్ర ప్రజలు ఎన్నటికీ సహించరు.

పోరాడి గెలుస్తాం!

మనం సత్యం వైపు ఉన్నాం!

సత్యమేవ జయతే!'' అని ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు.

కాగా శివసేన తమకే చెందుతుందని ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఏక్ నాథ్ షిండే వర్గం ఈసీలో వాదనలు వినిపించారు. ఒక దశలో దీనిపై ఉద్దవ్ ఠాక్రే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. ఏక్‌నాథ్ షిండే వర్గం వాలంటరీగా పార్టీని వీడారని, కాబట్టి వారికి తమ పార్టీ పేరును, గుర్తును ఉపయోగించుకునే హక్కు లేదని ఎలక్షన్ కమిషన్ ముందు ఠాక్రే వర్గం వాదించింది. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. రాబోయే ఉప ఎన్నికల్లో రెండు వర్గాలు శివసేన పేరును కానీ , ఆ పార్టీ గుర్తయిన విల్లు, బాణాన్ని ఉపయోగించకుండా ఎన్నికల కమిషన్ ఫ్రీజ్ చేసింది. దీంతో ఉద్దవ్ వర్గం ఏక్ నాథ్ పై మండిపోతూ ఉంది.


First Published:  9 Oct 2022 5:18 AM GMT
Next Story