Telugu Global
National

వారంతా పొలిటికల్‌ టూరిస్టులు.. - బీజేపీ సీఎంలకు నవీన్‌ పట్నాయక్‌ గట్టి కౌంటర్‌

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని సీఎంలు తమ ప్రసంగాల్లో భాగంగా ఒడిశాను దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా చేస్తామంటూ ఇచ్చిన హామీలపై సీఎం నవీన్‌ పట్నాయక్‌ మండిపడ్డారు

వారంతా పొలిటికల్‌ టూరిస్టులు.. - బీజేపీ సీఎంలకు నవీన్‌ పట్నాయక్‌ గట్టి కౌంటర్‌
X

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఎన్నికల వేళ ఒడిశాలో ప్రచారానికి తరలివచ్చి.. అక్కడి బిజూ జనతాదళ్‌ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజూ జనతాదళ్‌ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. వారంతా పొలిటికల్‌ టూరిస్టులని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి.. ఆ తర్వాత అదృశ్యమవుతారని విమర్శించారు. భువనేశ్వర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని సీఎంలు తమ ప్రసంగాల్లో భాగంగా ఒడిశాను దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా చేస్తామంటూ ఇచ్చిన హామీలపై సీఎం నవీన్‌ పట్నాయక్‌ మండిపడ్డారు. ముందు మీ రాష్ట్రంలో పరిస్థితి చూసుకోండి.. అంటూ వారికి సలహా ఇచ్చారు. ఒడిశాలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.

ఈ ప్రచారంలో భాగంగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలపై నవీన్‌ పట్నాయక్‌ వీడియో మెసేజ్‌ ద్వారా స్పందించారు. అస్సాం తలసరి అప్పు ఒడిశా కంటే రెట్టింపు ఉందని, మీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకోండి.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మీ మాటలకు ఒడిశా ప్రజలు నవ్వుకుంటారు.. అని పేర్కొన్నారు.

First Published:  19 May 2024 2:40 AM GMT
Next Story