Telugu Global
National

భారత్ లో వ్యాక్సిన్ తీసుకోనివారు 4కోట్లమంది..

ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. భారత్ లో ఇంకా వ్యాక్సిన్ తీసుకోనివారు 4కోట్లమంది ఉన్నారని చెప్పారు.

భారత్ లో వ్యాక్సిన్ తీసుకోనివారు 4కోట్లమంది..
X

వైద్య శాఖ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ తో మొదలు పెట్టి ఆ తర్వాత 18నుంచి 59 ఏళ్ల వయసు లోపు ఉన్నవారందరికీ భారత్ లో వ్యాక్సిన్ పంపిణీ చేశారు. రెండు డోసులు పూర్తయిన తర్వాత ప్రికాషనరీ డోస్ కూడా మొదలైంది. 12 ఏళ్ల వయసుపైబడిన వారికి కూడా టీకా పంపిణీ మొదలైంది. అంతా కలిపి భారత్ లో 200 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు పంపిణీ అయ్యాయని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. అయితే భారత్ లో ఇంకా 4 కోట్లమంది అర్హులు కనీసం ఒక్క డోస్ కూడా వ్యాక్సిన్ తీసుకోలేదనేది తాజా వాస్తవం. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. భారత్ లో ఇంకా వ్యాక్సిన్ తీసుకోనివారు 4కోట్లమంది ఉన్నారని చెప్పారు.

కారణం ఏంటి..?

భారత్ లో వ్యాక్సిన్ నిర్బంధం కాదని ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది కేంద్రం. స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు. మరి వ్యాక్సిన్ తీసుకోని 4కోట్లమంది నిరాకరించారా లేక వారికి వ్యాక్సిన్ అందడంలో ఆలస్యమైందా అనేది మాత్రం తేలాల్సి ఉంది. 4కోట్లమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడ్డారా లేదా అన్న విషయాన్ని మాత్రం మంత్రి స్పష్టం చేయలేదు.

భారత్ నుంచి పొరుగు దేశాలకు కూడా ఉచితంగా వ్యాక్సిన్ పంపించింది ప్రభుత్వం. భారత్ తయారీ వ్యాక్సిన్ ఇతర దేశాలకు భారీగా ఎగుమతి అయింది. అయితే అన్నిచోట్లకు మన వ్యాక్సిన్ వెళ్లినా, ఇంకా భారత్ లో 4కోట్లమందికి చేరకపోవడం మాత్రం విశేషమే. ఇప్పటి వరకూ కొవిడ్ వ్యాక్సిన్ డోసుల గురించి మాత్రమే భారత్ లో ప్రచారం జరిగింది. తొలిసారిగా విపక్ష సభ్యులు పట్టుబట్టే సరికి వ్యాక్సిన్ తీసుకోనివారి సంఖ్యను బయటపెట్టింది కేంద్రం. వ్యాక్సిన్ తీసుకోనివారంతా సూపర్ స్ర్పైడర్లు అనే మాట నిజమైతే.. భారత్ కి కొవిడ్ ముప్పు ఎప్పటికి తొలగిపోతుందో తేలాల్సి ఉంది.

First Published:  23 July 2022 3:32 AM GMT
Next Story