Telugu Global
National

ఢిల్లీలో ఆప్ ప్ర‌భుత్వాన్ని వెంటాడుతున్న లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ !

ఢిల్లీలోని డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్ (డిడిసి) వైస్ చైర్‌పర్సన్ జాస్మిన్ షా కార్యాల‌యానికి తాళం వేసి ఆయ‌నా, ఆయ‌న సిబ్బంది కార్యాల‌యాన్ని ఉప‌యోగంచుకోకుండా చేస్తూ ఈ రోజు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి. కె. సక్సేనా ఆంక్షలు విధించారు. దీంతో ఆప్ ప్ర‌బుత్వం, గ‌వ‌ర్న‌ర్ మ‌ద్య వివాదం క్ర‌మంగా తారాస్థాయికి చేరుకుంటోంది.

ఢిల్లీలో ఆప్ ప్ర‌భుత్వాన్ని వెంటాడుతున్న లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ !
X

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి. కె. సక్సేనా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం మధ్య రోజురోజుకీ వివాదాలు ముదురుతున్నాయి. తాజాగా ఈ రోజు ఒక ఉన్నత అధికారి కార్యాలయానికి తాళం వేయడమే గాక ఆయ‌న అధికారాలను తొలగించడంతో ఆప్ ప్ర‌బుత్వం, గ‌వ‌ర్న‌ర్ మ‌ద్య వివాదం క్ర‌మంగా తారాస్థాయికి చేరుకుంటోంది.

ఢిల్లీలోని డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్ (డిడిసి) వైస్ చైర్‌పర్సన్ జాస్మిన్ షా కార్యాల‌యానికి తాళం వేసి ఆయ‌నా, ఆయ‌న సిబ్బంది కార్యాల‌యాన్ని ఉప‌యోగంచుకోకుండా చేస్తూ ఆంక్ష‌లువిధించారు గవర్నర్.

షా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు గవర్నర్. గత సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం మేర‌కు, జాస్మిన్ షాకు తన అధికారిక వాహనం, సిబ్బందితో సహా అన్ని ఇతర "సౌకర్యాలు, అధికారాలను" ఉపసంహరించుకున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం థింక్ ట్యాంక్‌గా ఏర్పాటు చేసిన కమిషన్‌కు ఆప్ నేత జాస్మిన్ షా గత నెలలోనే చీఫ్‌గా నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో కూడిన కమిషన్ వైస్ చైర్మ‌న్ ప‌ద‌వినుంచి షాను తొల‌గించాల‌ని గ‌వ‌ర్న‌ర్ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ను కోరార‌ర‌ని అభిజ్ఞ వ‌ర్గాలు తెలిపాయి. జాస్మిన్ షా తన కార్యాలయాన్ని రాజకీయాల కోసం దుర్వినియోగం చేశారంటూ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ చేసిన ఫిర్యాదు మేరకు నెల రోజుల క్రితం షాకు లెఫ్టినెంట్ గవర్నర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు.

"డిడిసి వైస్-ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తూనే , జాస్మిన్ షా రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్ అధికారిక ప్రతినిధిగా వ్యవహరించారు.ఇది నిర్దేశిత విధానాలను, త‌ట‌స్థ సూత్రాల‌ను ఉల్లంఘించ‌డ‌మే" అని ప‌ర్వేష్ వ‌ర్మ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, కేబినెట్ ఆమోదించిన మంత్రి హోదాగ‌ల డిడిసి వైస్ చైర్మ‌న్ కార్యాల‌య వ్య‌వ‌హారాల్లో గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకునే అధికారం లేద‌ని జాస్మిన్ షా పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ కూడా షా వాద‌న‌ను స‌మ‌ర్ధించారు. జాస్మిన్ షాను ఢిల్లీ మంత్రివర్గం నియమించిందని, సక్సేనా అందులో జోక్యం చేసుకోజాల‌ర‌ని అన్నారు. ఢిల్లీ అభివృద్ధికి థింక్ ట్యాంక్ వెన్నెముకలాంటిద‌ని ఆయన పేర్కొన్నారు.

గ‌త మే నెల‌లో గ‌వ‌ర్న‌ర్ స‌క్సేనా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టినుంచి ఆప్ ప్ర‌బుత్వం, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ‌వ‌ర్న‌ర్ ఫిర్యాదుతో సిబిఐ ఉప ముఖ్య‌మంత్రి శిసోడియా ఇంటిపైన‌, కార్యాల‌యాల‌పైన లిక్క‌ర్ స్కాం ఆరోప‌ణ‌ల‌తో దాడులు చేసిన విష‌యం తెలిసిందే. దీనికి ప్ర‌తిగా ఆప్ గ‌వ‌ర్న‌ర్ పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసింది. ఖాదీ గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల సంస్థ చైర్మ‌న్ గా ఉన్న‌ప్పుడు ఆయ‌న అవినీతికి పాల్ప‌డ్డారంటూ తిప్పి కొట్టింది.

First Published:  18 Nov 2022 9:47 AM GMT
Next Story