Telugu Global
National

ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చుకెళ్ళిన ఘటన: 11 మంది పోలీసుల సస్పెండ్

ఘటన‌ జరిగిన రోజు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించిన పోలీసులు, ఆ ప్రాంత డీసీపీ పై చర్యలు తీసుకున్నారు. హిట్ అండ్ రన్ కేసుపై ఢిల్లీ పోలీసులు నివేదిక సమర్పించిన తర్వాత ఈ ఆదేశాలు వచ్చాయి.

ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చుకెళ్ళిన ఘటన: 11 మంది పోలీసుల సస్పెండ్
X

ఢిల్లీలో జనవరి 1న 20 ఏళ్ల అంజలిని కారుతో గుద్ది 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కంఝవాలా హిట్ అండ్ రన్ కేసులో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) 11 మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ గురువారం ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సస్పెండ్ అయినవారిలో ఒక డీసీపీతోపాటు 10 మంది కానిస్టేబుళ్ళున్నారు.

ఘటన‌ జరిగిన రోజు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించిన పోలీసులు, ఆ ప్రాంత డీసీపీ పై చర్యలు తీసుకున్నారు. హిట్ అండ్ రన్ కేసుపై ఢిల్లీ పోలీసులు నివేదిక సమర్పించిన తర్వాత ఈ ఆదేశాలు వచ్చాయి.

జనవరి 1న ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేస్తున్న అంజలి తన స్నేహితురాలు నిధితో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా నలుగురు వ్యక్తులతో వచ్చిన బాలెనో కారు ఆమెను ఢీకొట్టింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం అంజలి కాలు కారు ఎడమ ముందు చక్రానికి తగిలి ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు.

ఢిల్లీలోని కంఝవాలా ప్రాంతంలో అంజలి మృతదేహం కింద పడిపోయింది.

హిట్-అండ్-రన్ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై, నిర్లక్ష్యంతో కూడిన నేరపూరిత కుట్రతో మరణానికి కారణమైనట్టు కేసు నమోదు చేశారు.

నేరాన్ని కప్పిపుచ్చడానికి నిందితులకు సహకరించినందుకు కారు యజమానితో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరికి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

నిందితులు దీపక్ ఖన్నా, మనోజ్ మిట్టల్, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్, అశుతోష్ (కారు యజమాని), అంకుష్ లు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కారు అంజలిని ఢీకొట్టినప్పుడు అమిత్ డ్రైవ్ చేస్తున్నాడు.

First Published:  13 Jan 2023 12:27 PM GMT
Next Story