Telugu Global
National

త‌ప్ప‌తాగి పెళ్లికి డుమ్మాకొట్టిన వరుడు..పెళ్లికూతురు ఏం చేసిందంటే..

కళ్యాణ మండపం వద్ద వధువు కుటుంబీకులు పెళ్లి కొడుకు కోసం చాలాసేపు ఎదురు చూశారు. సమయం గడిచిపోతున్నా ఇంకా వరుడు ఎందుకు రాలేదని అతడి తరఫు బంధువులను నిలదీశారు.

త‌ప్ప‌తాగి పెళ్లికి డుమ్మాకొట్టిన వరుడు..పెళ్లికూతురు ఏం చేసిందంటే..
X

ఈమధ్య పెళ్లి పీటల వద్దకు పెళ్లి కుమారులు తాగి మరీ వస్తున్నారు. ఇటువంటి సంఘటనలతో పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లిళ్లు అర్థాంత‌రంగా ఆగిపోతున్నాయి. తాజాగా బీహార్ లో ఫుల్లుగా మందు కొట్టిన పెళ్ళికొడుకు తన పెళ్లి సంగతి తానే మర్చిపోయాడు. ఒకపక్క పెళ్లికూతురు ముస్తాబై పెళ్లి మండపంలో ఎదురు చూస్తుంటే.. పెళ్ళికొడుకు మాత్రం మద్యం మత్తులో నిద్రపోయి కళ్యాణ మండపానికి చేరుకోలేకపోయాడు. దీంతో ఇటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం భరించడం కష్టమని పెళ్లి కుమార్తె వివాహం రద్దు చేసుకుంది.

భాగల్ పూర్ జిల్లా సుల్తాన్ గంజ్ గ్రామానికి చెందిన వ్యక్తికి ఒక యువతితో పెళ్లి జరగాల్సి ఉంది. యువతి తరఫు బంధువులు ముహూర్తానికి ముందే కళ్యాణ మండపానికి చేరుకున్నారు. యువతిని పెళ్లికూతురిగా ముస్తాబు చేశారు. పెళ్లి వేదిక వద్దకు వధువును తీసుకువచ్చారు. అయితే పెళ్లి రోజున కూడా ఫుల్లుగా మందు కొట్టిన పెళ్ళికొడుకు కళ్యాణ మండపానికి వెళ్లాలనే సంగతే కూడా మరిచిపోయి నిద్రపోయాడు.

కళ్యాణ మండపం వద్ద వధువు కుటుంబీకులు పెళ్లి కొడుకు కోసం చాలాసేపు ఎదురు చూశారు. సమయం గడిచిపోతున్నా ఇంకా వరుడు ఎందుకు రాలేదని అతడి తరఫు బంధువులను నిలదీశారు. నిద్ర మత్తు వదిలిన తర్వాత హడావిడిగా పెళ్ళికొడుకు మండపం వద్దకు చేరుకున్నాడు. అతడ్ని చూడగానే పెళ్లికూతురు.. ఇటువంటి బాధ్యత లేని వ్యక్తిని తాను పెళ్లి చేసుకోనని, జీవితాన్ని పంచుకోలేనని తెగేసి చెప్పింది.

పెళ్లి ఏర్పాట్లకు ఖర్చు చేసిన డబ్బులు తమకు చెల్లించాలని వరుడి కుటుంబాన్ని వధువు కుటుంబీకులు డిమాండ్ చేశారు. దీనిపై వధువు, వరుడి కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. వరుడి కుటుంబీకులను వధువు కుటుంబీకులు నిర్బంధించారు. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.

First Published:  20 March 2023 9:53 AM GMT
Next Story