Telugu Global
National

ప్రజలకు గొప్ప న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన మోడీకి కృతజ్ఞతలు....నెటిజనుల వ్యంగ్యం... ట్విట్టర్ లో ట్రెండింగ్

ఈ దేశ ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా గొప్ప‌ గిఫ్ట్ ఇచ్చిన మోడీకి ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో నెటిజనులు వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ లో ఈ రోజు “రూ.25” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

ప్రజలకు గొప్ప న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన మోడీకి కృతజ్ఞతలు....నెటిజనుల వ్యంగ్యం... ట్విట్టర్ లో ట్రెండింగ్
X

నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వం వాణిజ్య LPG సిలిండర్లపై 25 రూపాయలు పెంచింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజనులు ప్రధాని మోడీపై వ్యంగ్య బాణాలతో విరుచుకపడుతున్నారు.

ఈ దేశ ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా గొప్ప‌ గిఫ్ట్ ఇచ్చిన మోడీకి ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో నెటిజనులు వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు.

ట్విట్టర్ లో ఈ రోజు "రూ.25" అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. కొందరు నెటిజనులు సీరియస్ గా స్పందించగా మరి కొందరు వ్యంగ్యంగా స్పందించారు. మోడీ సర్కార్ ను ఎగతాళి చేశారు. ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

"2023 మొదటి రోజున కమర్షియల్ LPG ధర రూ. 25 పెరిగింది. NDA ప్రభుత్వం నుండి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు" అని ఒక నెటిజన్ రాశారు.

ప్రధానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, మరొక నెటిజన్ ఇలా వ్రాశారు, "మోదీజీ" భారతదేశ ప్రజలకు నూతన సంవత్సర బహుమతులు ఇచ్చే శైలి గొప్పగా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 25."

మరో నెటిజన్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని గుర్తు చేసుకున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో LPG సిలిండర్ల ధరలు పెంచినప్పుడు ఆమె చేసిన ధర్నాను గుర్తు చేస్తూ ఇప్పుడామె ఎక్కడ దాక్కుంది? అని ప్రశ్నించారు.

''LPG సిలిండర్ల ధరలు మళ్ళీ పెరిగాయి. ప్రజలందరికీ అమృతకాలం శుభాకాంక్షలు'' అనిమరో నెటిజన్ స్పందించాడు.

''సంవత్సరం మొదటి రోజే ధరల పెరుగుదలతో మొదలయ్యింది. ఇక ఈ ఏడాదంతా అచ్చేదిన్ యే'' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

ఈ రోజు ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,769. ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,721, కోల్‌కతాలో రూ.1,870, చెన్నైలో రూ.1,971. హైదరాబాద్‌లో ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1,105గా ఉంది.

First Published:  1 Jan 2023 1:21 PM GMT
Next Story