Telugu Global
National

కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. ఆర్మీ కల్నల్ సహా ముగ్గురు మృతి

ఉగ్రవాదులు జరిపిన దాడిలో కల్నల్ మన్‌‌ప్రీత్ సింగ్,మేజర్ ఆశిష్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ హుమాయున్ భట్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత వాళ్లను ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తుండగా చనిపోయారు.

కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. ఆర్మీ కల్నల్ సహా ముగ్గురు మృతి
X

కశ్మీర్‌లో ఘోరం చోటు చేసుకుననది. ఉగ్రవాదులు చేసిన ఘాతుకానికి ఒక కల్నల్ సహా ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్‌నాగ్ హలురా గండుల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఉగ్రదాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ కల్నల్, ఒక మేజర్, జమ్మూ కశ్మీర్ డీఎస్పీ మృత్యువాత పడ్డారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో కల్నల్ మన్‌‌ప్రీత్ సింగ్,మేజర్ ఆశిష్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ హుమాయున్ భట్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత వాళ్లను ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తుండగా చనిపోయారు. అధిక రక్తస్రావం కారణంగానే హుమాయున్ భట్ మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

బుధవారం కోకెర్‌నాగ్ హులురా గండుల్ ప్రాంతంలో పోలీసులు, ఆర్మీ కలిసి జాయింట్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో జాయింట్ యాక్షన్ టీమ్‌కు అనుమానాస్పదంగా ఒక ప్రదేశం కనపడింది. దీంతో అక్కడ ఏముందో చూడటానికి టీమ్ అంతా కలిసి వెళ్తున్నారు. అయితే, అప్పటికే అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు బలగాల పైకి కాల్పులు జరిపారు. జాయింట్ యాక్షన్ టీమ్ కూడా వెంటనే తేరుకొని వారిపైకి కాల్పులు ప్రారంభించింది. అయితే ఈ కాల్పుల్లో ఆర్మీ అధికారికి, డీఎస్పీకి తూటాలు తగిలి గాయాలయ్యాయి. వారిని అసుపత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందారు.

దిగాడోల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం అయ్యింది. అయితే రాత్రి కావడంతో పోలీసులు ఆపరేషన్ నిలిపివేశారు. తిరిగి బుధవారం వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఆ టీమ్‌ను ముందుండి నడిపిస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. దీంతో ముందుగా ఆయనే గాయపడి ప్రాణాలు వదిలారు.


First Published:  14 Sep 2023 12:12 AM GMT
Next Story