Telugu Global
National

లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టిన‌ట్లు.. వ‌ర‌ల్డ్‌క‌ప్ ఒడిసి ప‌ట్టేసినట్టు..

జ‌య‌హో ఇండియా అంటూ గ్రౌండ్‌లోనే కేరింత‌లు కొట్టారు. లాస్ట్ బాల్‌కు సిక్సు కొట్టి వ‌ర‌ల్డ్ కప్ ఒడిసి ప‌ట్టేసినంతగా గంతులేశారు. ఈ వీడియోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌లవుతున్నాయి.

లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టిన‌ట్లు.. వ‌ర‌ల్డ్‌క‌ప్ ఒడిసి ప‌ట్టేసినట్టు..
X

చంద్ర‌యాన్ విజ‌యంతో దేశ‌మంతా సంబరాలు చేసుకుంటోంది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అందరూ ఇస్రోకు, ఇండియాకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌న టీమిండియా క్రికెట‌ర్ల సైతం ఈ సంబ‌రాల్లో భాగం పంచుకున్నారు. జ‌య‌హో ఇండియా అంటూ గ్రౌండ్‌లోనే కేరింత‌లు కొట్టారు. లాస్ట్ బాల్‌కు సిక్సు కొట్టి వ‌ర‌ల్డ్ కప్ ఒడిసి ప‌ట్టేసినంతగా గంతులేశారు. ఈ వీడియోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌లవుతున్నాయి.

గ్రౌండ్‌లో టీవీ చూస్తూ సంబ‌రాలు

ఐర్లాండ్‌తో చివ‌రిదైన టీ-20 మ్యాచ్ కోసం డ‌బ్లిన్‌లో సిద్ధ‌మైన టీమిండియా చంద్ర‌యాన్ లాంచింగ్ టైమ్‌కు టీవీకి అతుక్కుపోయారు. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టాల‌న్నంత టెన్ష‌న్ వాతావ‌ర‌ణం వారి ముఖాల్లో కనిపించింది. చంద్ర‌యాన్‌-3 విజ‌యవంతంగా చంద్రుని మీద లాండ్ అయింద‌ని ప్రక‌ట‌న రాగానే కెప్టెన్ బుమ్రా, ఆట‌గాళ్లు రుతురాజ్ గైక్వాడ్‌, య‌శ‌స్వి జైస్వాల్ త‌దిత‌రుల‌తోపాటు స‌పోర్టింగ్ స్టాఫ్ కూడా చ‌ప్ప‌ట్ల‌తో సంబ‌రాలు చేసుకున్నారు.

చరిత్ర సృష్టించారని కొనియాడిన బీసీసీఐ

హిస్ట‌రీ క్రియేటెడ్‌.. మిష‌న్ స‌క్సెస్‌ఫుల్ కంగ్రాచ్యులేష‌న్స్ ఇండియా #చంద్ర‌యాన్‌3, @ఇస్రో అంటూ బీసీసీఐ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. చ‌రిత్ర సృష్టించారంటూ ఇస్రో శాస్త్రవేత్త‌ల‌ను కొనియాడింది.

First Published:  24 Aug 2023 5:47 AM GMT
Next Story