Telugu Global
National

మోడీ సార్.. భలే కవర్​ చేశారు.. స్టాలిన్ ఫైర్

మల్లికార్జున ఖర్గే, రాహుల్​ గాంధీ అడిగిన అనేక ప్రశ్నలను పార్లమెంట్​ రికార్డుల నుంచి తొలగించడం సరికాదన్నారు. రికార్డుల నుంచి తొలగించినంత మాత్రాన.. ప్రజల మనసుల్లోంచి ఆ విషయాలు చెరిగిపోవని చెప్పారు.

మోడీ సార్.. భలే కవర్​ చేశారు.. స్టాలిన్ ఫైర్
X

తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా.. ప్రశ్నలకు ఆన్సర్​ చేయకుండా పార్లమెంట్ లో ప్రధాని మోడీ బాగా కవర్​ చేశారని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విమర్శలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి ఎలా చేయాలో మోడీని చూసి నేర్చుకోవచ్చన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ అంశం, అదానీ ఆస్తుల పతనం అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చను రేకెత్తిస్తుంటే ప్రధాని ఆ విషయాల మీద కనీసం మాట్లాడకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.

మంగళవారం ఆయన చెన్నైలో నిర్వహించిన ‘ఉంగాళిల్​ ఒరువన్​’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్​ లో రాహుల్​ గాంధీ ఎన్నో విలువైన ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. వాటిని బీజేపీ నేతలు, ముఖ్యంగా ప్రధాని పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు.

మల్లికార్జున ఖర్గే, రాహుల్​ గాంధీ అడిగిన అనేక ప్రశ్నలను పార్లమెంట్​ రికార్డుల నుంచి తొలగించడం సరికాదన్నారు. రికార్డుల నుంచి తొలగించినంత మాత్రాన.. ప్రజల మనసుల్లోంచి ఆ విషయాలు చెరిగిపోవని చెప్పారు.

హిండెన్ బర్గ్​ నివేదిక, బీబీసీ డాక్యుమెంటరీ ఇటీవల దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అదానీకి బీజేపీకి ఉన్న సత్సంబంధాల మీద జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై బీజేపీ స్పందించకుండా ఎదురుదాడికి దిగుతోంది. కాగా, తాజాగా ఈ అంశాలను తమిళనాడు సీఎం స్టాలిన్​ ప్రస్తావించారు.

First Published:  14 Feb 2023 12:34 PM GMT
Next Story