Telugu Global
National

కేరళలో స్వైన్‌ఫ్లూ, జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ..

ఉత్తర కేరళ జిల్లాలోని కనిచర్ గ్రామంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందిందని అధికారులు గుర్తించారు. వెంటనే స్పందించిన ఆ జిల్లా కలెక్టర్ అక్కడి రెండు పొలాల్లో పందులను చంపేయాలని ఆదేశించారు.

కేరళలో స్వైన్‌ఫ్లూ, జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ..
X

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అందరినీ కలవర పెట్టేసింది. అంతకు ముందు రెండు మూడేళ్లు మనల్ని ఇబ్బంది పెట్టిన వ్యాధులలో బర్డ్ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ ఉన్నాయి.. పేర్లు ఒకేలా ఉన్నా ఇవి రెండు ఒకటి కాదు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ కలకలం రేపగా, జార్ఖండ్‌లో ఏడాది తొమ్మిది నెలల చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకింది. దీంతో రెండు రాష్ట్రాలలోనూ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

కేరళలో ఉత్తర కేరళ జిల్లాలోని కనిచర్ గ్రామంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందిందని అధికారులు గుర్తించారు. వెంటనే స్పందించిన ఆ జిల్లా కలెక్టర్ అక్కడి రెండు పొలాల్లో పందులను చంపేయాలని ఆదేశించారు. స్థానిక మలయంపాడి వద్ద ఉన్న ఓ పొలంలో స్వైన్‌ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో జిల్లా అధికారులు ఆ ప్రాంతంలోని, 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరొక పొలంలో పందులను చంపి, ప్రొటోకాల్ ప్రకారం వాటి క‌ళేబ‌రాల‌ను పూడ్చాలని ఆదేశించారు. పందుల పెంపకం చుట్టూ ఒక కిలోమీటరు విస్తీర్ణంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించిన ప్రాంతాన్ని వ్యాధి సోకిన ప్రాంతంగానూ, 10కిలోమీటర్ల వ్యాసార్థాన్ని వ్యాధి నిఘా జోన్‌గానూ ప్రకటించారు. ఈ ప్రాంతంలో పంది మాంసం పంపిణీ, అమ్మకం, ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం మూడు నెలల పాటు నిషేధించారు.హెచ్‌1 ఎన్‌1 అనే వైరస్‌ మూలంగా వచ్చే స్వైన్‌ ఫ్లూ లోనూ సాధారణ ఫ్లూ జ్వరం లక్షణాలే కనిపిస్తాయి. అయితే స్వైన్‌ ఫ్లూ.. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

ఇక జార్ఖండ్‌లో బర్డ్‌ ఫ్లూ కలకలం సృష్టించింది. రామ్‌గఢ్‌ జిల్లాకు చెందిన ఓ తొమ్మిది నెలల చిన్నారికి బర్డ్‌ ఫ్లూ సోకింది. దీంతో ఆ చిన్నారికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో 9 నెలల చిన్నారి రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లో చేరారని పీడియాట్రిక్స్‌ విభాగానికి చెందిన సీనియర్‌ డాక్టర్‌ ప్రకటించారు. గత రెండు మూడు సంవత్సరాలుగా బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఇప్పుడు జార్ఖండ్‌లో మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదవ్వడంతోదేశంలో మళ్లీ కలకలం మొదలైంది. బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా అని కూడా పిలుస్తారు. ఈ వైరస్ పక్షుల నుండి మానవులకు త్వరగా వ్యాపిస్తుంది.. కానీ మనిషి నుంచి మనిషికి వ్యాప్తించడం చాలా తక్కువ, అయితే మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ వైరస్ రకాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది.

First Published:  19 Aug 2023 12:32 PM GMT
Next Story