Telugu Global
National

31న బిర్యానీ ఆర్డర్ల మోత

అత్యధికంగా బిర్యానీ అమ్మకాలు బావర్చి రెస్టారెంట్ నుంచి జరిగాయి. హైదరాబాద్‌లోని బావర్చి రెస్టారెంట్ నుంచి శనివారం రోజు నిమిషానికి సరాసరి రెండు బిర్యానీలు అమ్మకానికి వెళ్ళాయి.

31న బిర్యానీ ఆర్డర్ల మోత
X

డిసెంబర్ 31 రాత్రి దేశంలో బిర్యానీ ఆర్డర్ల మోత మోగింది. శనివారం రోజు అత్యధికంగా ఆర్డర్ వచ్చిన ఐటమ్ గా బిర్యానీ తొలి స్థానంలో నిలిచిందని స్విగ్గీ వెల్లడించింది. అందిన బిర్యానీ ఆర్డర్లలోనూ హైదరాబాద్ బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 75.4% మంది హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేశారు. 14.2 శాతం మంది లఖ్ నవి బిర్యానీ, 10.4 శాతం మంది కోల్ కతా బిర్యానీ కొనుగోలు చేసినట్టు స్విగ్గీ వెల్లడించింది.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శనివారం రాత్రి 10.25 గంటలకు దేశవ్యాప్తంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లను తాము డెలివరీ చేసినట్టు ఆ సంస్థ వివరించింది. శనివారం సాయంత్రం 7.20 గంటల సమయానికే 1.65 లక్షల బిర్యానీలు డెలివరీ చేసినట్టు చెబుతోంది.

అత్యధికంగా బిర్యానీ అమ్మకాలు బావర్చి రెస్టారెంట్ నుంచి జరిగాయి. హైదరాబాద్‌లోని బావర్చి రెస్టారెంట్ నుంచి శనివారం రోజు నిమిషానికి సరాసరి రెండు బిర్యానీలు అమ్మకానికి వెళ్ళాయి. న్యూ ఇయర్ డిమాండ్ ను తట్టుకునేందుకు హైదరాబాద్‌లోని బావర్చి రెస్టారెంట్ 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసి అమ్మినట్టు స్విగ్గీ వివరించింది. శనివారం రోజు దేశవ్యాప్తంగా డోమినోస్ ఇండియాకు చెందిన 61 వేల పిజ్జాలను స్విగ్గీ డెలివరీ చేసింది. శనివారం రాత్రి 9.18 గంటల వరకు 12,344 మంది కిచిడీని ఆర్డర్ చేశారు.

First Published:  1 Jan 2023 1:03 PM GMT
Next Story