Telugu Global
National

సురేష్‌ గోపి యూటర్న్‌.. కేబినెట్‌లో కొనసాగుతానని ప్రకటన

తను హైకమాండ్‌ను కేంద్రమంత్రి పదవి కోరలేదని..త్వరలోనే ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కోరాతానన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని సినిమాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.

సురేష్‌ గోపి యూటర్న్‌.. కేబినెట్‌లో కొనసాగుతానని ప్రకటన
X

కేంద్రమంత్రి వర్గం నుంచి తాను తప్పుకుంటున్నానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు కేరళ బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్‌ గోపి. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు సురేష్ గోపి. ఈ మేరకు క్లారిటీ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు సురేష్ గోపి. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానంటూ చెప్పారు. కేంద్ర కేబినెట్‌లో ఉండడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు.


ఐతే అంతకు ముందు సురేష్‌ గోపి కేంద్రమంత్రి పదవి నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో కార్యక్రమం తర్వాత కేరళ వెళ్లిన సురేష్‌ గోపి ఓ స్థానిక ఛానల్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే ఈ ప్రచారానికి ఊతమిచ్చాయి. తను హైకమాండ్‌ను కేంద్రమంత్రి పదవి కోరలేదని..త్వరలోనే ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కోరాతానన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని సినిమాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. సురేష్‌ గోపి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో తాజాగా ఆయన ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.





నిన్న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేరళ నుంచి సురేష్‌ గోపితో పాటు జార్జి కురియన్ కురియన్‌ కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సురేష్‌ గోపి కేరళలోని త్రిస్సూర్‌ నుంచి ఎంపీగా గెలిచారు. కేరళలో బీజేపీ గెలిచిన ఏకైక ఎంపీ స్థానం ఇదే.

First Published:  10 Jun 2024 2:17 PM GMT
Next Story