Telugu Global
National

స్టాలిన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కొద్దిరోజుల కిందట విచారణ నిర్వహించిన హైకోర్టు ఆర్ఎస్ఎస్ ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

స్టాలిన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి
X

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. తమిళనాడులో మొదటి నుంచి ద్రవిడ పార్టీల హవా ఎక్కువ. జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రంలో ఆదరణ ఉండదు. ఆర్ఎస్ఎస్ వంటి హిందూ సంఘాల కార్యక్రమాలు కూడా తక్కువగా జరుగుతుంటాయి. కాగా, ఇటీవల తమిళనాడు వ్యాప్తంగా రోడ్డు ర్యాలీలు నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. ఇందుకోసం ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరగా సీఎం స్టాలిన్ ఇందుకు నిరాకరించారు.

తమిళనాడు వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ర్యాలీలు నిర్వహిస్తే నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దాడులకు పాల్పడే అవకాశం ఉందని, దీనివల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ప్రభుత్వం అనుమతి నిరాక‌రించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కొద్దిరోజుల కిందట విచారణ నిర్వహించిన హైకోర్టు ఆర్ఎస్ఎస్ ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. తమిళనాడు వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించుకోవడానికి ఆర్ఎస్ఎస్ కు అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీల నిర్వహణకు ఆర్ఎస్ఎస్ సమాయత్తం అవుతోంది.

First Published:  11 April 2023 10:33 AM GMT
Next Story