Telugu Global
National

అత్యాచారం కేసులో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్‌కు సుప్రీంకోర్టు షాక్... ఎఫ్ఐఆర్ నమోదు తప్పదు

బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ తనపై అత్యాచారం చేశాడని 2018 ఏప్రిల్ 26న ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. 2018 ఏప్రిల్ 12న షానవాజ్ హుస్సేన్ తనను ఛతర్‌పూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు పిలిపించాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఆమెకు మత్తు మందు ఇప్పించి అత్యాచారం చేశాడు.

అత్యాచారం కేసులో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్‌కు సుప్రీంకోర్టు షాక్... ఎఫ్ఐఆర్ నమోదు తప్పదు
X

నాలుగేళ్ల నాటి అత్యాచారం కేసులో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్ నమోదుపై స్టే విధించాలన్న షానవాజ్ హుస్సేన్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీనిపై సరైన విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. ''ఇందులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు. మీ వైపు న్యాయం ఉంటే, మీరు రక్షింపబడతారు'' అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

షానవాజ్ హుస్సేన్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయనపై ఇప్పుడు అత్యాచారం కేసు నమోదు కానుంది.

జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ అనంతరం షానవాజ్ హుస్సేన్ పిటిషన్‌ను కొట్టివేసింది. హుస్సేన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ్‌ లూథ్రా వాదిస్తూ, ఫిర్యాదుదారైన‌ మహిళ ఒకదాని తర్వాత ఒకటిగా షానవాజ్ హుస్సేన్ పై అనేక ఫిర్యాదులు చేసిందని ధర్మాసనానికి తెలిపారు.

బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ తనపై అత్యాచారం చేశాడని 2018 ఏప్రిల్ 26న ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. 2018 ఏప్రిల్ 12న షానవాజ్ హుస్సేన్ తనను ఛతర్‌పూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు పిలిపించాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఆమెకు మత్తు మందు ఇప్పించి అత్యాచారం చేశాడు. పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకపోవడంతో ఆ మహిళ కోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. జూలై 7, 2018న, మేజిస్ట్రేట్ కోర్టు, హుస్సేన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత హుస్సేన్ దానిని హైకోర్టులో సవాలు చేయగా, అక్కడ కూడా ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది.

First Published:  17 Jan 2023 11:12 AM GMT
Next Story