Telugu Global
National

ముగ్గురు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌లు సుప్రీంకు..! – సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

కొలీజియం సిఫార్సు చేసినవారిలో ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, రాజస్థాన్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అగస్తిన్‌ జార్జ్‌ మాసిహ్, గువాహటి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సందీప్‌ మెహతా ఉన్నారు.

ముగ్గురు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌లు సుప్రీంకు..! – సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
X

సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలను నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన ముగ్గురూ దేశంలోని 3 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఈ మేరకు వీరి నియామకాన్ని ఆమోదిస్తే.. సుప్రీంకోర్టు మొత్తం 34 మంది న్యాయమూర్తులతో పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది.

కొలీజియం సిఫార్సు చేసినవారిలో ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, రాజస్థాన్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అగస్తిన్‌ జార్జ్‌ మాసిహ్, గువాహటి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సందీప్‌ మెహతా ఉన్నారు. ప్రస్తుత ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ గతంలో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2021 అక్టోబర్‌ 11న తెలంగాణ హైకోర్టుకు సీజేగా వచ్చిన ఆయన 2022 జూన్ 8న ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్‌ ఏజీ మాసిహ్‌ రాజస్థాన్‌ సీజేగా ఈ ఏడాది మే 30న నియమితులయ్యారు. జస్టిస్‌ సందీప్‌ మెహతా ఈ ఏడాది ఫిబ్రవరి 15న గువాహటి హైకోర్టుకు సీజేగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

First Published:  7 Nov 2023 2:50 AM GMT
Next Story