Telugu Global
National

సూసైడ్ డ్రోన్.. దీని విశేషాలేంటో చూడండి

సూసైడ్ డ్రోన్ గా పిలువబడుతున్న ఈ కామికేజ్ డ్రోన్ ఓ బుల్లి విమానాన్ని పోలి ఉంటుంది. పొడవాటి దీని రెక్కల్ని మడతపెట్టే అవకాశముంది.

సూసైడ్ డ్రోన్.. దీని విశేషాలేంటో చూడండి
X

దాని పేరు సూసైడ్ డ్రోన్. అయితే దానికి ఆత్మహత్యలకు ఎలాంటి సంబంధం లేదు. శత్రు శిబిరాలపై చాకచక్యంగా దాడి చేయడం దాని విధి. మనం చెప్పిన పని గుడ్డిగా చేసుకుపోవడమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సొంత నిర్ణయాలు తీసుకుని, అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుని శత్రువుల పని పట్టడం దీని స్పెషాలిటీ. భారత సైన్యం అమ్ములపొదిలో చేర్చేందుకు ఈ అత్యాధునిక మానవరహిత వాహనం (UAV)ని సిద్ధం చేశారు ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్తలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత కామికేజ్‌ డ్రోన్‌ అభివృద్ధి చేశారు.

సూసైడ్ డ్రోన్ ప్రత్యేకతలు

6 కేజీల బరువు

100 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం

జీపీఎస్ సపోర్ట్ లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకునే సామర్థ్యం

డ్రోన్ రాడార్లను తప్పించుకునే స్టెల్త్ టెక్నాలజీ

శత్రు శిబిరాలను ఫొటోలు తీయగలిగే ఆధునిక కెమెరాలు

అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగలిగే సామర్థ్యం

సూసైడ్ డ్రోన్ గా పిలువబడుతున్న ఈ కామికేజ్ డ్రోన్ ఓ బుల్లి విమానాన్ని పోలి ఉంటుంది. పొడవాటి దీని రెక్కల్ని మడతపెట్టే అవకాశముంది. డీఆర్డీవోకు చెందిన యంగ్‌ సైంటిస్ట్‌ ల్యాబొరేటరీ ప్రాజెక్టు కింద ఈ డ్రోన్‌ ను గత ఏడాది నుంచి అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు ఐఐటీ కాన్పూర్‌ ఏరోస్పేస్‌ డిపార్ట్‌ మెంట్‌ అధికారులు. ఆరు నెలల్లో వీటిని పూర్తి స్థాయిలో పరీక్షిస్తామన్నారు. రిమోట్ లొకేషన్లనుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చని తెలిపారు.

First Published:  12 July 2023 2:53 AM GMT
Next Story