Telugu Global
National

అదానీ గ్రూప్ ఆస్తులు జాతీయం చేయాలి –సుబ్రహ్మణ్య స్వామి

అదానీ గ్రూపు వ్యవహారం బీజేపీకి ఇబ్బందిగా మారిన వేళ, సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన సలహా మరింత ఇరుకున పెట్టేలా ఉంది. అదానీ గ్రూపు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసి, వాటిని వేలం వేయాలని కోరారు సుబ్రహ్మణ్య స్వామి.

అదానీ గ్రూప్ ఆస్తులు జాతీయం చేయాలి –సుబ్రహ్మణ్య స్వామి
X

‘అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి వాటిని వేలం వేయాలి. వచ్చిన నగదును నష్టపోయిన వారికి సహాయంగా అందజేయాలి.’ ఈ మాటలన్నది ప్రతిపక్ష నేతలు కాదు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. బీజేపీ తన పవిత్రత నిరూపించుకోవాలంటే అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని చెప్పారాయన. ప్రధాని మోదీ ఏదో దాచిపెడుతున్నారనే భావన ప్రజల్లో ఉందని, దాన్ని చెరిపేయాలంటై స్పష్టత ఇవ్వాల్సిందేనని చెప్పారు.

హిండెన్‌ బర్గ్‌ నివేదిక, అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చకు కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అదానీ గ్రూపు వ్యవహారం బీజేపీకి ఇబ్బందిగా మారిన వేళ, సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన సలహా మరింత ఇరుకున పెట్టేలా ఉంది. అదానీ గ్రూపు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసి, వాటిని వేలం వేయాలని కోరారు సుబ్రహ్మణ్య స్వామి.

మోదీని ప్రశ్నించరా..?

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణంపై ఇటీవల సుబ్రహ్మణ్య స్వామి సానుభూతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. కార్గిల్‌ యుద్ధానికి కారణమైన వ్యక్తిని సుబ్రహ్మణ్య స్వామి ఎలా పొగుడుతున్నారంటూ చాలామంది విమర్శించారు. అయితే కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో పాకిస్తాన్ సైనికాధిపతిగా ఉన్న ముషారఫ్ మరణంపై సానుభూతి వ్యక్తం చేస్తేనే ఇంత ఇదైపోతున్నారే, అదే యుద్ధం జరిగే సమయంలో పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ ఇంటికెళ్లి మరీ ఆయన ఆతిథ్యం స్వీకరించిన మోదీని నెజిటన్లు ఎందుకు ప్రశ్నించరని అంటున్నారు సుబ్రహ్మణ్య స్వామి. ముషారఫ్ విషయంలో తనన ప్రశ్నించే ముందు, మోదీని ప్రశ్నించాలని సలహా ఇచ్చారాయన.

అది బోగస్ బడ్జెట్..

నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేట్టినప్పటి నుంచి ఆమెపై విమర్శలు స్తున్న సుబ్రహ్మణ్యస్వామి, తాజా బడ్జెట్‌ పై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. అది బోగస్ బడ్జెట్ అని అన్నారు. 2019లో లేని ఆర్థిక వృద్ధి 2023లో ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. బడ్జెట్ లో వ్యవసాయం, పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రభుత్వానికి అసలు ఎలాంటి వ్యూహం లేదని ఈ బడ్జెట్‌ తో స్పష్టంగా తెలుస్తోందన్నారు.

First Published:  8 Feb 2023 11:27 AM GMT
Next Story