Telugu Global
National

కవితను అభినందించిన సీతారాం ఏచూరి...పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటన‌

రాజ్యసభలో మహిళలకు రిజర్వేషన్ బిల్లు పాసయ్యిందని, లోక్ సభలో మాత్రం ఇప్పటి వరకు పెండింగులో ఉందని, 30 ఏళ్ళుగా పెండింగులో ఉన్న‌ ఆ బిల్లు ఆమోదం పొందే వరకు కవిత చేస్తున్న పోరాటానికి తమ పూర్తి సహకారం ఉంటుందని సీతారాం ఏచూరి తెలిపారు.

కవితను అభినందించిన సీతారాం ఏచూరి...పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటన‌
X

చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలనే డిమాండ్ తో ఈ రోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభించారు. అనేక రాష్ట్రాల నుండి దాదాపు 5వేల మంది పాల్గోన్న ఈ కార్యక్రమాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కవిత మంచి ప్రయత్నం మొదలు పెట్టారని అభినందించారు.

ఈ దేశంలో తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. రాజకీయ రంగంలో మహిళలు చాలా తక్కువగా ఉన్నారని, పార్లమెంటులో మహిళా ప్రతినిధులు 11 శాతం మాత్రమే ఉన్నారన్నారు. ఈ పరిస్థితి మారాలంటే మహిళా రిజర్వేషన్ చట్టం చేయడమొక్కటే మార్గమని ఏచూరి అన్నారు.

రాజ్యసభలో ఆ బిల్లు పాసయ్యిందని లోక్ సభలో మాత్రం ఇప్పటి వరకు పెండింగులో ఉందని, 30 ఏళ్ళుగా పెండింగులో ఉన్న‌ ఆ బిల్లు ఆమోదం పొందే వరకు కవిత చేస్తున్న పోరాటానికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు పై మోడీ హామీ ఇచ్చి 9 ఏళ్ళయ్యిందని, ఇప్పటి వరకు ఆయన తన హామీని అమలు చేయలేదని, మోడీ తన హామీని నిల‌బెట్టుకోవాలని ఏచూరి డిమాండ్ చేశారు.

First Published:  10 March 2023 6:47 AM GMT
Next Story