Telugu Global
National

అంతు చిక్కని మిస్టరీ.. భూమిలో కూరుకుపోతున్న జోషిమఠ్

ఇళ్లన్నీ బీటలు వారుతున్నాయి. భూమి కుంచించుకుపోతోంది. ఒకటి రెండు కాదు.. దాదాపుగా 600 ఇళ్లకు పగుళ్లు ఏర్పడి కూలిపోయే దశకు చేరుకున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్ లు సైతం నేలమట్టం అవుతున్నాయి.

అంతు చిక్కని మిస్టరీ.. భూమిలో కూరుకుపోతున్న జోషిమఠ్
X

సముద్రమట్టానికి 6వేల అడుగుల ఎత్తులో ఉన్న పట్టణం అది. హిమాలయాలకు ప్రవేశ ద్వారంలా ఉంటుంది. ఉత్తరాఖండ్ లో ఉన్న ఆ పట్టణం పేరు జోషిమఠ్. ఉన్నట్టుండి ఆ పట్టణం కింద ఉన్న భూమి కుంగిపోతోంది, ఇళ్లన్నీ బీటలు వారుతున్నాయి. భూమి కుంచించుకుపోతోంది. ఒకటి రెండు కాదు.. దాదాపుగా 600 ఇళ్లకు పగుళ్లు ఏర్పడి కూలిపోయే దశకు చేరుకున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్ లు సైతం నేలమట్టం అవుతున్నాయి. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జోషిమఠ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. 600 కుటుంబాలను అక్కడినుంచి తరలిస్తోంది.




కారణం ఏంటి..?

జోషిమఠ్ ఘటనపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అక్కడ వాతావరణ మార్పులు, అభివృద్ధి పనులోకసం కొండల్ని తవ్వడం, రోడ్లు, హైవేలకోసం మట్టిని తరలించడం వంటి కార్యక్రమాల వల్ల ఒక్కసారిగా ఇలాంటి ఇబ్బంది ఎదురైనట్టు చెబుతున్నారు స్థానికులు. హైడల్ పవర్ ప్లాంట్ల కోసం తవ్విన సొరంగాల వల్లే ఇలాంటి వైపరీత్యం కలిగిందని అంటున్నారు మరికొందరు.

నిపుణుల బృందం అధ్యయనం..

జోషిమ‌ఠ్‌ లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై అధ్యనం చేసేందుకు కేంద్రం ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. నేలకూలుతున్న బిల్డింగ్‌లు, హైవేలు, ఇత‌ర‌మౌలిక వసతుల కార్యాలయాలపై అధ్యయనానికి ఆ బృందం జోషిమఠ్ చేరుకుంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ థామి కూడా జోషి మ‌ఠ్‌ వాసులకు ధైర్యం చెప్పారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ‌కాలిక ప్రణాళిక‌ త‌యారు చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్రకటించారు. అవ‌స‌రమైతే విమానాల్లో ప్ర‌జ‌ల్ని త‌ర‌లించేందుకు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

ఇప్పటికే ఓ ఆలయం భూమిలోకి కుంచించుకు పోయింది, మరికొన్ని నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. బ‌ద్రీనాథ్‌, హేమ‌కుండ్ సాహిబ్‌ కు వెళ్లేందుకు జోషిమ‌ఠ్ కీల‌క మార్గం. ఈ ప‌ట్ట‌ణం నుంచి ఆ రెండు క్షేత్రాల‌కు భ‌క్తులు వెళ్తుంటారు. ఇండియా, చైనా బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న మిలిట‌రీ బేస్ క్యాంప్ కూడా ఇక్క‌డే ఉంటుంది. ఆసియాలోనే అతిపెద్ద అవులీ రోప్‌ వే కూడా ఇక్క‌డ ఉంది. ప్‌ుస్తుతం ఆ రోప్‌ వే ఉన్న ప్రాంతంలో కూడా భూమి బీటలువారడంతో దాన్ని నిలిపివేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను కూడా ఆపేశారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంపైనే అధికారులు దృష్టిపెట్టారు. మొత్తం 3వేలమందిని తరలించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

First Published:  7 Jan 2023 7:31 AM GMT
Next Story