Telugu Global
National

త్రిపుర‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

త్రిపుర‌లో బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన నాలుగో ఎమ్మెల్యే ఈయ‌న‌.

త్రిపుర‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
X

ఇత‌ర పార్టీల నుంచి ఎమ్మెల్యేల‌ను లాక్కుంటున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి త్రిపుర లో ఓ ఎమ్మెల్యే జ‌ల‌క్ ఇచ్చారు.

త్రిపురలోని అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ త‌గిలింది. శుక్ర‌వారం శాసనసభ సమావేశాల మొదటి రోజే ఎమ్మెల్యే బుర్బా మోహన్ త్రిపుర త‌న ప‌ద‌వికి, పార్టీకి కూడా రాజీనామా చేశారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన నాలుగో ఎమ్మెల్యే ఈయ‌న‌. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కర్బుక్ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. త‌న రాజీనామాను ఆమోదించాల‌ని కోరుతూ స్పీక‌ర్ ర‌త‌న్ చ‌క్ర‌వ‌ర్తికి లేఖ ఇచ్చారు. మోహ‌న్ త్రిపుర రాజీనామా స‌రైన ఫార్మాట్ లోనే ఉంద‌ని స్పీక‌ర్ చెప్పారు.

మోహ‌న్ త్రిపుర రాజీనామా చేసిన త‌ర్వాత, రాజ వంశీయుడు, టిఐపిఆర్ఎ మోతా పార్టీ అధినేత ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దెబ్బర్మ అతనితో పాటు కనిపించారు. ప్రద్యోత్ విలేకరులతో మాట్లాడుతూ, "నేను అతనికి సంఘీభావం తెలిపేందుకు వచ్చాను. ఏ జాతీయ పార్టీతోనూ సంబంధం పెట్టుకోకుండా తిప్రాస కోసం పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

అంతకుముందు, ఆశిష్ దాస్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరగా, సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహా బిజెపి నుండి కాంగ్రెస్‌లోకి మారారు. ఆ తర్వాత దాస్ కూడా టీఎంసీని వీడారు.

బిజెపి, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్టి) 2018లో మొదటిసారిగా 44 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో బిజెపి కి 36,ఐప‌సిఎఫ్ టి కి 8 సీట్లు ఉన్నాయి. అయితే, ఒక సంవత్సరం క్రితం, ఐపిఎఫ్ టి శాసనసభ్యుడు బృషకేతు దెబ్బర్మ ప్రద్యోత్ కిషోర్ పార్టీలో చేరడానికి పార్టీని వీడారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను ఆయన సభ్యత్వానికి ఇటీవల అసెంబ్లీ అనర్హత వేటు వేసింది.

First Published:  23 Sep 2022 11:16 AM GMT
Next Story