Telugu Global
National

750 మంది విద్యార్థుల శ్రమ నిష్ఫలం .. ఉసూరుమన్న ఇస్రో

75 వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా 'ఆజాదీశాట్' పేరిట 75 స్కూళ్లకు చెందిన 750 మంది విద్యార్థినులు 'ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్2' పేరుతో చిన్ని శాటిలైట్ ని రూపొందించారు. ఆశాటిలైట్ ను ఇస్రో ఈ రోజు ప్రయోగించింది. అయితే సెన్సర్ ఫెయిల్యూర్ కారణంగా రాకెట్ తన గమనాన్ని మార్చుకుందని, అందువల్ల నేటి మిషన్ లక్ష్యాలను సాధించలేకపోయినట్టేనని ఇస్రో వర్గాలు ప్రకటించాయి.

750 మంది విద్యార్థుల శ్రమ నిష్ఫలం .. ఉసూరుమన్న ఇస్రో
X

చిన్న ఉపగ్రహాల ప్రయోగాలు విఫలమవుతున్నాయని ఇస్రో ఉసూరుమంటోంది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మిషన్ కి 'గ్రహణం' పట్టిందని వాపోతోంది. ఇందుకు కారణం ఆదివారం ఉదయం 9 గంటల 18 నిముషాలకు తిరుపతి జిల్లా 'షార్' లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకుపోయిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్ విజయవంతంగా మూడు దశలు పూర్తి చేసుకున్నా.ఆ తరువాత . సాంకేతిక సమస్య తలెత్తడమే.. టెర్మినల్ దశకు సంబంధించిన సమాచారం అందడంలో జాప్యం జరుగుతోందని ఇస్రో వర్గాలు వెల్లడించినప్పుడే ఈ మిషన్ పై అనుమానాలు తలెత్తాయి. అయినా రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నామని ఈ సంస్థ చైర్మన్ సోమనాథ్ చెప్పారు. ఇది స్థిరంగా లేని కక్ష్యలో రెండు శాటిలైట్లను ప్రవేశ పెట్టిందని, అందువల్ల ఇక వీటివల్ల ఉపయోగం లేదని ఆ తరువాత ఇస్రో వర్గాలు ప్రకటించాయి. నేటి మిషన్ లక్ష్యాలను సాధించలేకపోయినట్టే... సెన్సర్ ఫెయిల్యూర్ కారణంగా రాకెట్ తన గమనాన్ని మార్చుకుందని అసలు ఎక్కడ లోపం తలెత్తిందో విశ్లేషించేందుకు ఓ కమిటీని నియమిస్తున్నామని ఈ వర్గాలు చెప్పాయి. తుది దశలో డేటా అందకుండాపోయినప్పుడే తమకు సందేహాలు కలిగినట్టు వెల్లడించాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవాలను కేంద్రం ఘనంగా నిర్వహిస్తోంది. వీటిని పురస్కరించుకుని.. 75 వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా 'ఆజాదీశాట్' పేరిట 75 స్కూళ్లకు చెందిన 750 మంది విద్యార్థినులు 'ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్2' పేరుతోఈ చిన్ని శాటిలైట్ ని రూపొందించారు. దీనికి 75 పే లోడ్స్ ఉన్నాయి. కేవలం 8 కిలోల బరువున్న దీని జీవితకాలం 6 నెలలు.

ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల వెలాసిటీ ట్రిమ్మింగ్ మోడ్యూల్ ..టెర్మినల్ దశలో మండలేదని, ఫెయిల్యూర్ కి ఇది కూడా ఓ కారణమని భావిస్తున్నారు. ఈ మోడ్యూల్ 30 సెకండ్లు మండవలసి ఉండగా కేవలం ఒక్క సెకండ్ మాత్రమే మండింది. నిజానికి ఈ వాహక నౌక 356 కి. మీ. సర్క్యులర్ ఆర్బిట్ లో బదులు 356 కి.మీ.x 76 కిలోమీటర్ల ఆర్బిట్ లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. దీనికి ఇందులోని సెన్సర్ సాధనం పని చేయకపోవడమే కారణమని భావిస్తున్నాం అని ఇస్రో వర్గాలు వివరించాయి. స్థిరంగా లేని కక్ష్యలో ఇవి చేరలేదంటే వీటి పని తీరుమీద కూడా తీవ్ర ప్రభావం పడినట్టే.. అప్పుడు ఈ శాటిలైట్లు ఒకదానికొకటి ఢీ కొనవచ్చు..లేదా తిరిగి భూమి మీద ఎక్కడో కూలిపోవచ్చు.. లేక ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో క్రాష్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి అని నిపుణులు

అంటున్నారు. మొత్తానికి 169 కోట్ల రూపాయల వ్యయంతో చేబట్టిన ఈ మిషన్ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. కేవలం ఒక్క ఏడాదిలో ఇస్రోకు ఇది రెండోసారి విఫలమైన మిషన్.. 2021 లో ఈ సంస్థ చేబట్టిన జీఎస్ఎల్వీ-f 10 మిషన్ కూడా విఫలమైంది. దీన్ని ప్రయోగించిన 297.3 సెకండ్లలోనే సాంకేతిక సమస్య కారణంగా కుప్ప కూలింది. లాంచ్ వెహికల్ లోని క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ పని చేయకపోవడంతో ఈ మిషన్ ఆదిలోనే నిరాశను మిగిల్చింది. కేవలం దిగువ కక్ష్యల్లోనే కాక.. డీప్ స్పేస్ లో కూడా ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలదని మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఇస్రోకి ఈ లేటెస్ట్ మిషన్ విఫలం కావడం పెద్ద దెబ్బే !

Next Story